Moviesఅఖిల్ రూట్లోనే నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ... ఆ సినిమాలో కేమియో ఎంట్రీ...!

అఖిల్ రూట్లోనే నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ… ఆ సినిమాలో కేమియో ఎంట్రీ…!

నందమూరి అభిమానులు ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న త‌రుణం త్వ‌ర‌లోనే రాబోతోంది. ఈ వంశంలో సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌ర్వాత రెండో త‌రంలో ఆయ‌న వార‌సులు ఇద్ద‌రూ బాల‌కృష్ణ‌, హ‌రికృష్ణ హీరోలు అయ్యారు. వీరిలో బాల‌కృష్ణ నాలుగు ద‌శాబ్దాలుగా సీనియ‌ర్ హీరోగా, స్టార్ హీరోగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నారు. వీరి తర్వాత మూడో త‌రం హీరోలుగా నంద‌మూరి వంశం నుంచి తార‌క‌ర‌త్న‌, క‌ళ్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు.

ఇదే వంశంలో మూడో త‌రం నుంచే బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇస్తాడ‌ని గ‌త నాలుగైదేళ్లుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాలో ఆయ‌న కుమారుడు వ‌శిష్టీ పుత్ర పులోమావీగా న‌టిస్తాడ‌న్న ప్ర‌చారం గ‌ట్టిగా వినిపించింది. బాల‌య్య వందో సినిమా అయిపోయింది. ఇప్పుడు 107వ సినిమా చేస్తున్నాడు… అయినా మోక్ష‌జ్ఞ ఇంకా సినిమాల్లోకి రాలేదు.

మ‌ధ్య‌లో సింగీతం శ్రీనివాస‌రావు ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌గా ఆదిత్య 999 సినిమాలో మోక్షు ఎంట్రీ ఉంటుంద‌న్న ప్ర‌చారం జ‌రిగింది. ఇక పూరి జ‌గ‌న్నాథే మోక్షు డెబ్యూ మూవీ డైరెక్ట‌ర్ అని కూడా అన్నారు. ఇవేవి నిజం కాలేదు. అయితే ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం ప్ర‌య‌త్నాలు అయితే మొద‌లైపోయాయ్‌.. స్పీడ్‌గానే న‌డుస్తున్నాయి. గ‌తంలో మోక్షు చాలా బొద్దుగా ఉండేవాడు.

ఆ ఫిజిగ్ చూసే నంద‌మూరి అభిమానులు షాక్ అయ్యారు. అయితే ఇప్పుడు తీవ్ర‌మైన క‌స‌ర‌త్తుల‌తో చాలా వ‌ర‌కు మాంచి బాడీ షేప్ తీసుకువ‌చ్చేశాడు. అమెరికాలో న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకున్న మోక్షు జిమ్‌లో కూడా తీవ్ర‌మైన క‌స‌ర‌త్తులే చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే మోక్షు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో ఎక్కువ స‌మ‌యం స్పెండ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఇదే పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

అయితే మోక్ష‌జ్ఞ ముందుగా హీరోగా కాకుండా అక్కినేని అఖిల్ మ‌నం సినిమాలో ఎలా కేమియో రోల్ చేసి ఆ త‌ర్వాత అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడో.. ఇప్పుడు మోక్షు కూడా అనిల్ రావిపూడి – బాల‌య్య సినిమాలో చిన్న రోల్ మోక్షుది ఉంటుంద‌ని అంటున్నారు. ఏదేమైనా మోక్ష‌జ్ఞ ఎంట్రీ నంద‌మూరి అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్‌గా ఉంటుంద‌న్న న‌మ్మ‌కాలు అయితే వ‌చ్చేశాయ్‌..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news