Moviesత‌న‌కంటే 10 ఏళ్ల చిన్నోడితో ఘాటు ప్రేమ‌లో అనుష్క‌... ముదురు ప్రేమ...

త‌న‌కంటే 10 ఏళ్ల చిన్నోడితో ఘాటు ప్రేమ‌లో అనుష్క‌… ముదురు ప్రేమ ఏమ‌వుతుందో ?

స్విటీబ్యూటీ అనుష్క శెట్టి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓ ఆరాధ్య హీరోయిన్‌. అప్పుడెప్పుడో 2005లో పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సూప‌ర్ సినిమాతో ఆమె సెకండ్ హీరోయిన్‌గా వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యింది. ఆ సినిమాలో అనుష్క హాట్ రోల్ చూసిన వారు ఆమె ఇన్నేళ్లు హీరోయిన్‌గా వెండితెర‌ను ఏలుతుంద‌ని ఊహించి ఉండ‌రు. అస‌లు అనుష్క హీరోయిన్ అవ్వాల‌న్న కోరిక‌తో రాలేదు. ఆమె అంత‌కు ముందు యోగా టీచ‌ర్‌. అక్కినేని హీరో నాగ‌చైత‌న్య‌కు యోగా పాఠాలు నేర్పేది.

ఈ క్ర‌మంలోనే నాగార్జున‌కు ప‌రిచ‌యం కావ‌డం.. అనూహ్యంగా నాగార్జున త‌న సొంత బ్యాన‌ర్లో నిర్మిస్తోన్న సూప‌ర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఆ త‌ర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. అస‌లు సౌత్ సినిమాను అనుష్క మామూలుగా ఏల‌లేదు. ఇక బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత అనుష్క రేంజ్ అయితే పాన్ ఇండియా లెవ‌ల్లోకి వెళ్లిపోయింది.

బాహుబ‌లి సీరిస్ సినిమాల మ‌ధ్య‌లో అనుష్క సైజ్ జీరో సినిమా చేసింది. ఆ సినిమా కోసం ఆమె కాస్త ఒళ్లు చేసింది. బాడీ వెయిట్‌లో తేడా వ‌చ్చేసింది. బాహుబ‌లి పెద్ద హిట్ అయినా ఎందుకో ఆ త‌ర్వాత అనుష్క‌కు అవ‌కాశాలు రాలేదు. నిశ్శ‌బ్దం త‌ర్వాత మూడేళ్లు ఖాళీగా ఉంది. ఇందుకు క‌రోనా త‌ప్పు కూడా ఉంది. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు అనుష్క మ‌ళ్లీ వెండితెర మీద క‌నిపించ‌బోతోంది. అనుష్క ప్రధాన పాత్రలో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తోన్న చిత్ర షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది.

ప్ర‌భాస్ హోం బ్యాన‌ర్ యూవీ క్రియేష‌న్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు మ‌హేష్ పి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. తాజా షెడ్యూల్ హైద‌రాబాద్‌లో స్టార్ట్ అయ్యింది. ఇక ఈ సినిమా క‌థ ఏంట‌న్న‌ది బ‌య‌ట‌కు వ‌చ్చింది. 37 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఓ ఆంటీ.. త‌న కంటే ప‌దేళ్లు చిన్నోడు అయిన ఓ 27 ఏళ్ల అబ్బాయితో ప్రేమ‌లో ప‌డుతుంద‌ట‌. ఈ ప్రేమ వ‌ల్ల వాళ్లు ? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు… చివ‌ర‌కు ఏమైంది అన్న నేప‌థ్యంలో సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది.

మ‌రి ముదురు వ‌య‌స్సులో ఉన్న అనుష్క చేసే ఈ సాహ‌స‌మైన రోల్ ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పిస్తుంది అన్న‌ది చూడాలి. ఇక క‌థానుగుణంగా అనుష్క బవురు కోల్పోయి చాలా స్లిమ్‌గా మారింది. కామెడీతో పాటు సెంటిమెంట్ నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news