Moviesనాగార్జున హీరోయిన్‌ను ఒంట‌రిగా రూమ్‌కు ర‌మ్మ‌న్న హీరో... నో చెప్పింద‌ని ఏం...

నాగార్జున హీరోయిన్‌ను ఒంట‌రిగా రూమ్‌కు ర‌మ్మ‌న్న హీరో… నో చెప్పింద‌ని ఏం చేశాడంటే…!

సినిమా ఇండ‌స్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు బాగా బ‌య‌ట‌కు వ‌స్తోంది. అయితే ఇది ఇప్పటి నుంచే కాదు. గ‌త కొన్ని ద‌శాబ్దాల నుంచి న‌డుస్తున్న‌దే. అయితే అప్ప‌ట్లో ఇప్పుడు ఉన్నంత సోష‌ల్ మీడియా లేక‌పోవ‌డం… పైగా మీడియా వాళ్లు కూడా కాస్త ప‌క్ష‌పాతంలో హీరోయిన్ల బాధ‌లు రాసే సాహ‌సం చేయ‌క‌పోవ‌డంతో ఇవ‌న్నీ బ‌య‌ట‌కు రాలేదు. 1980వ ద‌శ‌కంలో స్టార్ హీరోయిన్లలో కూడా చాలా మంది ఛాన్సుల కోసం నిర్మాత‌లు, హీరోలు, ద‌ర్శ‌కుల‌తో ప‌క్క‌లు పంచుకున్న వారే. ఇప్ప‌డు ఉన్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుల‌ను అడిగితే చాలా విష‌యాలే బ‌య‌ట‌కు వ‌స్తాయ్‌.

ఇక ఇప్పుడు సోష‌ల్ మీడియా యుగంలో మీడియాయే అక్క‌ర్లేదు. ఎవ‌రికి వారు స్వ‌చ్ఛందంగా త‌మ సొంత సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్‌ల ద్వారానే తాము ఎదుర్కొన్న ఇబ్బందులు.. తాము ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి ఓపెన్ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఓ సీనియ‌ర్ హీరోయిన్ సైతం తాను ఓ హీరో నుంచి ఎదుర్కొన్న లైంగీక వేధింపుల‌ను బ‌య‌ట పెట్టింది.

ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు.. ఇషా కొప్పిక‌ర్‌. బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట పెట్టింది. ఇషా 1990 ద‌శ‌కం చివ‌ర్లో కెరీర్ స్టార్ట్ చేసి కొన్నేళ్ల పాటు సినిమాలు చేసింది. అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్‌లోనూ న‌టించింది. నాగార్జున ప‌క్క‌న కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చంద్ర‌లేఖ సినిమా, వెంకీకి జోడీగా ప్రేమ‌తో రా సినిమాలు చేసింది.

ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ వ‌య‌స్సు 45 ఏళ్లు. తాను సినిమాల్లోకి వ‌చ్చిన కొత్త‌లో మ‌నం యాక్ట‌ర్లుగా తెర‌మీద ఎలా క‌నిపిస్తున్నాము.. ఎలా న‌టిస్తున్నాము అనేదే ముఖ్యం అనుకునే దానిని అని.. అయితే ఓ రోజు జ‌రిగిన సంఘ‌ట‌న‌తో నా హృద‌యం ముక్క‌లైంద‌ని ఆమె వాపోయింది. ఓ నిర్మాత ఫోన్ చేసి హీరో రాసుకున్న హీరోయిన్ల లిస్టులో మీరు కూడా ఉన్నార‌ని చెప్పారు. నాకు అర్థం కాక ఆ హీరోకు ఫోన్ చేస్తే న‌న్ను ఒంట‌రిగా రూమ్‌కు ర‌మ్మ‌న్నాడ‌ని చెప్పింది.

స్టాఫ్‌ను కూడా తీసుకు రాకుండా ఒంట‌రిగా ర‌మ్మ‌ని అన‌డంతోనే నాకు సీన్ అర్థ‌మైపోయింద‌ని ఇషా చెప్పింది. తాను త‌న అందంతో పాటు త‌న టాలెంట్‌తోనే ఈ స్థాయికి వ‌చ్చాన‌ని.. నువ్వు ఇచ్చే ఛాన్స్ కోసం ఇంత‌లా దిగ‌జార‌తాను అని ఎలా అనుకున్నావ్ అని లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకాన‌ని… దీంతో ఆ హీరో న‌న్ను సినిమా నుంచి త‌ప్పించేశాడ‌ని నాటి సంఘ‌ట‌న ఇషా గుర్తు చేసుకుంది. అయితే ఈ అనుభ‌వం ఎదురైంది.. బాలీవుడ్‌లోనా… టాలీవుడ్‌లోనా ? అన్న‌ది మాత్రం ఆమె చెప్ప‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news