Moviesవావ్‌.. సూప‌ర్‌స్టార్‌నే ప‌డ‌గొట్టేసేంత‌ అందం శ్రీలీల సొంతం..!

వావ్‌.. సూప‌ర్‌స్టార్‌నే ప‌డ‌గొట్టేసేంత‌ అందం శ్రీలీల సొంతం..!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన అల వైకుంఠ‌పురంలో సినిమా వ‌చ్చి రెండేళ్లు దాటేసింది. మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు త్రివిక్ర‌మ్ సినిమా రాలేదు. అయితే ఇటీవ‌ల వ‌చ్చిన భీమ్లానాయ‌క్ సినిమాకు క‌థా విస్త‌ర‌ణ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు మాత్రం త్రివిక్ర‌మే చూసుకున్నారు. త్వ‌ర‌లో ప‌వ‌న్ – సాయితేజ్ మ‌ల్టీస్టార‌ర్ సినిమా క‌థ‌, స్క్రీన్ ప్లే కూడా త్రివిక్ర‌మే చూస్తున్నార‌న్న ప్ర‌చారం అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఉంది. అయితే త్రివిక్ర‌మ్ అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్ మ‌హేష్‌బాబుతోనే..! ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమా చేస్తోన్న మ‌హేష్ ఆ సినిమా షూటింగ్ పూర్తి కావ‌డంతో త్వ‌ర‌లోనే త్రివిక్ర‌మ్ సినిమాకు జాయిన్ అవుతాడు.

మ‌హేష్‌తో గ‌తంలో అత‌డు, ఖ‌లేజా లాంటి సినిమాలు త్రివిక్ర‌మ్ రూపొందించారు. ఖ‌లేజా 2010లో వ‌చ్చింది. ఈ సినిమా వ‌చ్చి 12 ఏళ్లు అవుతోంది. భారీ అంచనాల మ‌ధ్య వ‌చ్చిన ఖ‌లేజా డిజాస్ట‌ర్ అయ్యింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా తెర‌కెక్కుతుండ‌డంతో అంచ‌నాలు అయితే మామూలుగా లేవు. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ .. మ‌హేష్ కోసం ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ స్టోరీ రెడీ చేసిన‌ట్టు తెలిసింది.

ఇక త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఖ‌చ్చితంగా ఇద్ద‌రు హీరోయిన్లు ఉండాల్సిందే. మెయిన్ హీరోయిన్‌తో పాటు స‌పోర్టింగ్ హీరోయిన్ ఉంటారు. స‌పోర్టింగ్ హీరోయిన్‌కు ఐదారు సీన్ల‌తో పాటు ఓ పాట పెడుతూ ఉండ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అత్తారింటికిలో స‌మంత‌తో పాటు ప్ర‌ణీత – అర‌వింద స‌మేత‌లో పూజాతో పాటు ఈషా రెబ్బ – అజ్ఞాత‌వాసిలో కీర్తి సురేష్‌తో పాటు అనూ ఎమాన్యుయేల్ – అల సినిమాలో పూజా ఉన్నా నివేదా పేతురాజ్ కూడా ఉన్నారు.

ఈ సెంటిమెంట్ ప్ర‌కార‌మే మ‌హేష్ సినిమాకు పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్‌గా ఎంపికైంది. ఇప్పుడు సెకండ్ హీరోయిన్ కోసం త్రివిక్ర‌మ్ శ్రీలీల‌ను ఓకే చేశార‌ట‌. అయితే శ్రీలీల అంత సులువుగా ఈ పాత్ర‌కు ఓకే చెప్ప‌లేద‌ని అంటున్నారు. త‌న‌కు కూడా ఐదారు సీన్లు.. ఓ పాట పెట్టేస్తే కుద‌ర‌ద‌ని.. త‌న రోల్‌కు ప్రాధాన్యం ఉండాల్సిందే అని ప‌ట్టుబ‌ట్ట‌డంతో.. ఆమెకు అనుగుణంగానే త్రివిక్ర‌మ్ శ్రీలీల పాత్ర‌కు ప్రాధాన్యం పెంచాడ‌ని అంటున్నారు.

పెళ్లిసందD లాంటి సినిమాతోనే ఆమె త‌న అందంతో అంద‌రి చూపుల‌ను త‌న వైపున‌కు తిప్పేసుకుంది. మ‌రి మ‌హేష్ లాంటి సూప‌ర్‌స్టార్ ప‌క్క‌న చ‌క్క‌టి అందంతో శ్రీలీల తెర‌మీద క‌నిపిస్తే చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు. అస‌లే మ‌హేష్ మాంచి అంద‌గాడు.. ఈ అందానికి శ్రీలీల అందం తోడైతే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో చెప్ప‌క్క‌ర్లేదు. ఏదేమైనా శ్రీలీల కోసం త్రివిక్ర‌మ్ ప‌డిన క‌ష్టం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news