Moviesరు. 500 కోట్ల కేజీయ‌ఫ్ 2... క‌ళ్లు చెదిరిపోయే రికార్డులు ఇవే...!

రు. 500 కోట్ల కేజీయ‌ఫ్ 2… క‌ళ్లు చెదిరిపోయే రికార్డులు ఇవే…!

రాఖీ భాయ్ బాక్సాఫీస్‌ను దున్నేస్తున్నాడు. ఎక్క‌డిక‌క్క‌డ రికార్డులు షేక్ అయిపోతున్నాయి. క‌న్న‌డ రాకింగ్‌స్టార్ య‌శ్ – ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్లో వ‌చ్చిన కేజీయ‌ఫ్ 2 సినిమా తొలి రోజే బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా రు. 165 కోట్ల గ్రాస్ వసూళ్లు సొంతం చేసుకుంది. ఇక రెండో రోజు కూడా అదిర‌పోయే వ‌సూళ్లు సాధించింది. ఓవ‌రాల్‌గా చూస్తే ఈ సినిమా ఫ‌స్ట్ వీకెండ్‌కే రు. 500 కోట్ల క్ల‌బ్‌లో చేరిపోయే ఛాన్సులు ఉన్నాయి.

అసలు బాలీవుడ్‌లో హిందీ వెర్ష‌న్ ప‌రంగా పాత రికార్డుల‌ను పాత‌రేసి పాతాళంలోకి తొక్కేసిన కేజీయ‌ఫ్ రు. 53.95 కోట్ల‌తో ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు హిందీలో ఉన్న హృతిక్ రోష‌న్ వార్ సినిమా రు. 51 కోట్ల వ‌సూళ్ల‌ను బీట్ చేసి బాలీవుడ్ ఖాన్‌ల కంచుకోట‌ల‌ను బ‌ద్ద‌లు కొట్టేసింది. ఇక రెండో రోజు కూడా అదే దూకుడు కొన‌సాగిస్తూ రు. 51.6 కోట్ల వ‌సూళ్లు సాధించ‌డం సంచ‌ల‌నంగా మారింది. రెండు రోజుల‌కే రు. 100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు సైతం షాక్ అవుతున్నాయి.

అస‌లు దీనిని దేశ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఓ క‌న్న‌డ సినిమా అనుకోవ‌డం లేదు. ఇక కేర‌ళ‌లో అయితే ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేస్తూ మ‌ళ‌యాళ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొలి రోజు రు. 7 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధిస్తే.. రెండో రోజు ఏకంగా మొద‌టి రోజు క‌న్నా ఎక్కువుగా రు. 9 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. దీనిని బ‌ట్టే మ‌ళ‌యాళంలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది.

ఇక క‌ర్నాట‌క‌లో రు. 30 కోట్లు, త‌మిళ‌నాడులో రు. 14 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. పైగా అక్క‌డ ప్రాంతీయాభిమానం ఎక్కువ‌. విజ‌య్ బీస్ట్ పోటీ త‌ట్టుకుని రు. 14 కోట్లు కొల్ల‌గొట్టింది. త‌మిళ‌నాడులో సోమ‌వారంతో బీస్ట్ ప‌నైపోయేలా ఉంది. ఆ త‌ర్వాత కేజీయ‌ఫ్ 2 హ‌వానే కొన‌సాగ‌నుంది.

ఇక ఏపీ, తెలంగాణ‌లో తొలి రోజు రు. 31 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధిస్తే.. రెండో రోజు అంత‌కు మించి ఏకంగా రు. 36 కోట్లు రాబ‌ట్టింది. అంటే మూడో రోజుకే రు. 100 కోట్ల క్ల‌బ్‌కు చేరువ కానుంది. అస‌లు భాష‌తో, రాష్ట్రంతో సంబంధం లేకుండానే ఎక్క‌డిక‌క్క‌డ ఫ‌స్ట్ వీకెండ్‌కే రు. 100 కోట్ల వ‌సూళ్లు సాధించ‌నుంది. అస‌లు ఇది తెలుగు సినిమాయేనా ? అన్న‌ట్టుగా వ‌సూళ్లు వ‌స్తున్నాయి. ఒక్క హైద‌రాబాద్ సిటీలోనే రెండో రోజు ఏకంగా రు. 4.60 కోట్ల వ‌సూళ్లు సాధించింది.

ఓవ‌ర్సీస్ విష‌యానికి వ‌స్తే తొలి రోజు రు 23.90 కోట్ల వ‌సూళ్లు రాబ‌డితే రెండో రోజు కూడా రు. 24 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధించింది. మూడో రోజు ఆదివారం రావడంతో ఈ వ‌సూళ్లు డ‌బుల్ అవుతాయ‌ని అంటున్నారు. ఏదేమైనా మూడు రోజుల‌కే ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 500 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌తో అదిరిపోయే రికార్డులు ఈ సినిమా సొంతం చేసుకోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news