Moviesటాలీవుడ్‌లో శ్రీలీల శ‌కం మొద‌లైంది... న‌క్క తోక తొక్కేసి క్రేజీ సినిమాలో...

టాలీవుడ్‌లో శ్రీలీల శ‌కం మొద‌లైంది… న‌క్క తోక తొక్కేసి క్రేజీ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది..!

టాలీవుడ్‌లో గ‌త కొన్నేళ్లుగా చూస్తే ఒక్కో టైంలో ఒక్కో హీరోయిన్ శ‌కం న‌డిచింది. త‌మ‌న్నా, న‌య‌న‌తార లాంటి వాళ్లు మాత్రం ప‌దిహేనేళ్ల పాటు ఇండ‌స్ట్రీలో ఉన్నారు. ఆ త‌ర్వాత త‌మ‌న్నా కూడా మ‌ధ్య‌లో ప‌డినా కంటిన్యూ అవుతోంది. అలాగే ఇలియానా, స‌మంత ఈ కోవ‌లోనే గ‌త రెండేళ్లుగా పూజా హెగ్డే, ర‌ష్మిక మంద‌న్న హ‌వా న‌డుస్తోంది. ఈ లిస్టులోకి ఇప్పుడు తెలుగు హీరోయిన్ రావ‌డం విశేషం. తెలుగు అమ్మాయి శ్రీలీల హ‌వా టాలీవుడ్‌లో స్టార్ట్ అయిన వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది.

శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ న‌టించిన పెళ్లిసంద‌D సినిమాతో హీరోయిన్‌గా మారింది విజ‌య‌వాడ అమ్మాయి శ్రీలీల‌. సినిమా ఏం బాగోలేదు అన్నారు. అయితే చివ‌ర‌కు క‌మ‌ర్షియ‌ల్‌గా సేఫ్ వెంచ‌ర్ అయ్యింది. ట్రేడ్ వ‌ర్గాలు చెప్పిన ఒకే ఒక మాట ఏంటంటే ఇదంతా శ్రీలీల పుణ్య‌మే అన్నారు. ఇంకేముందు ఈ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యింది.

వ‌రుస పెట్టి క్రేజీ ఛాన్సులు కొట్టేస్తూ దూసుకుపోతోంది. ఒక‌ప్పుడు రు. 25 ల‌క్ష‌ల‌తో స్టార్ట్ అయిన శ్రీలీల రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు కోటి దాటేసింది. దిల్ రాజు కాంపౌండ్ హీరో ఆశీష్ రెండో ప్ర‌య‌త్నంగా సెల్ఫిష్ అనే సినిమా స్టార్ట్ అయ్యింది. ధ‌నుష్ క్లాప్‌తో గ్రాండ్‌గా స్టార్ట్ అయిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌. దిల్ రాజు లాంటి పెద్ద కాంపౌండ్‌లో.. పైగా వాళ్ల ఫ్యామిలీ హీరో సినిమాలో అంటే శ్రీలీల‌ది గోల్డెన్ లెగ్గే అనుకోవాలి.

తొలి సినిమాతోనే ఆమెకు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ వ‌చ్చేసింది. యువ‌త అయితే ఆమె అందాల కోస‌మే వెయిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ర‌వితేజ ప‌క్క‌న ధ‌మాకా, గాలి జ‌నార్థ‌న్ రెడ్డి కొడుకు సినిమాలో, నితిన్ – వ‌క్కంతం వంశీ సినిమా… వైష్ణవ్ తేజ్, నవీన్ పొలిశెట్టి కొత్త సినిమాల కోసం కూడా శ్రీలీలే హీరోయిన్‌. ఇక ఇప్పుడు దిల్ రాజు బ్యాన‌ర్లో హీరోయిన్‌.

అస‌లు ఏ కొత్త ప్రాజెక్టు లాంచ్ అవుతున్నా హీరోయిన్‌గా శ్రీలీల పేరే ముందుగా వినిపిస్తోంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో పాటు జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లోనూ హీరోయిన్‌గా ఆమె పేరు వినిపిస్తోంది. స్టార్ హీరోల‌తో ఒక్క ఛాన్స్ ప‌డిందంటే చాలు ఇక శ్రీలీల వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news