Moviesప‌వ‌ర్ స్టార్ - మెగాస్టార్‌... ఈ ఫొటో వెన‌క ఇంత ఇంట్ర‌స్టింగ్...

ప‌వ‌ర్ స్టార్ – మెగాస్టార్‌… ఈ ఫొటో వెన‌క ఇంత ఇంట్ర‌స్టింగ్ స్టోరీ ఉందా… !

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ప‌వ‌న్ క‌ళ్యాన్ 1996లో ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. ప‌వ‌న్ ఈ సినిమా చేసే ముందే వైజాగ్‌కు చెందిన అమ్మాయితో పెళ్లి కూడా అయిపోయింది. అనూహ్యంగా ప‌వ‌న్ త‌న డెసిష‌న్ మార్చుకుని వెండితెరంగ్రేటం చేశాడు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్లో అల్లు అర‌వింద్ ప‌వ‌న్‌ను హీరోగా ప‌రిచ‌యం చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో ప‌వ‌న్ ఓకే చేశాడు. అయితే అంత‌కుముందే రామ్‌గోపాల్ వ‌ర్మ స్వ‌యంగా చిరంజీవితో మీ త‌మ్ముడిని తాను హీరోగా ప‌రిచ‌యం చేస్తాన‌ని చెప్పి ప‌వ‌న్‌ను క‌లిసి క‌థ చెప్పారు. అయితే వ‌ర్మ చెప్పిన క‌థ ప‌వ‌న్‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. అప్ప‌ట‌కీ ప‌వ‌న్ ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. తాను చెప్పిన క‌థ ప‌వ‌న్‌కు న‌చ్చ‌క‌పోవ‌డంతో వ‌ర్మ కూడా హ‌ర్ట్ అయిన‌ట్టున్నాడు. త‌న లాంటి పెద్ద ద‌ర్శ‌కుడి చెప్పిన క‌థ న‌చ్చ‌క‌పోవ‌డం ఏంట‌ని వ‌ర్మ‌కు కోపం వ‌చ్చేసింది. ఆ తర్వాత వీరిద్ద‌రు క‌లిసే అవ‌స‌ర‌మే రాలేదు.

ఇక ఈవీవీ – ప‌వ‌న్ సినిమా ఓకే అయ్యాక హీరోయిన్‌గా అనుకోకుండా అక్కినేని మ‌న‌వ‌రాలు సుప్రియ‌ను సెల‌క్ట్ చేశారు. ఆమెకు కూడా అదే ఫ‌స్ట్ సినిమా. త‌న త‌మ్ముడిని ఇండ‌స్ట్రీకి చాలా కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల‌ని చిరు భావించారు. ప‌వ‌న్ పోస్ట‌ర్ డిజైన్ కూడా చాలా కొత్త‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ముందు ప‌వ‌న్ ఫోటోలు బ‌య‌ట‌కు రిలీజ్ చేసి.. ఈ అబ్బాయి ఎవ‌రు ? అంటూ బ‌య‌ట‌కు వ‌దిలారు.

ఆ త‌ర్వాత సినిమా రిలీజ్‌కు ముందు ఇత‌డే ప‌వ‌న్ క‌ళ్యాన్ అంటూ పోస్ట‌ర్లు వ‌దిలారు. దీంతో ప్రేక్ష‌కుల్లో క్యూరియాసిటీ బాగా పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి చిన్న త‌మ్ముడు అని మంచి అంచ‌నాలే ఏర్ప‌డ్డాయి. చిరంజీవి స్వ‌యంగా ఓ పెద్ద ఈవెంట్ పెట్టి మెగాఫ్యాన్స్‌కు ఇత‌డు నా త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ ప‌రిచ‌యం చేశాడు. ఈ పిక్‌లో చిరంజీవి ప‌వ‌న్‌ను ప‌రిచ‌యం చేస్తుంటే ప‌క్క‌న నాగ‌బాబు కూడా ఉన్నాడు.

ఇక షూటింగ్ జ‌రుగుతున్న‌న్ని రోజులు చిరు స్వ‌యంగా షూటింగ్‌ను ప‌ర్య‌వేక్షించారు. చిరు స్వ‌యంగా సెట్స్‌లోకి వెళ్లి ప‌వ‌న్ హెయిర్ స్టైల్‌, డ్రెస్ స్టైల్ ఎలా ? ఉండాలో ప‌లు సూచ‌న‌లు చేసేవారు. ఈ స్టిల్ చిరు ప‌వ‌న్ హెయిర్ స్టైల్ సెట్ చేస్తున్న‌ప్పుడు తీసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ జ‌రిగిన‌న్ని రోజులు నెల‌కు రు. 5 వేలు ఖ‌ర్చులుగా ప‌వ‌న్‌కు అర‌వింద్ రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ట‌. అక్టోబ‌ర్ 11, 1996లో విడుద‌ల అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్ అయ్యింది. 32 సెంటర్ల‌లో 50 రోజులు, రెండు సెంట‌ర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news