Moviesపవన్ కళ్యాణ్ తన ' అమ్మ అంజ‌న‌మ్మ‌ ' కు ప్రివ్యూ...

పవన్ కళ్యాణ్ తన ‘ అమ్మ అంజ‌న‌మ్మ‌ ‘ కు ప్రివ్యూ షో చూపించిన సినిమా ఏదో తెలుసా…?

టాలీవుడ్లో పవర్‌స్టార్ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ ఎన్ని సంవత్సరాలు సినిమా చేయకపోయినా పవన్ అభిమానులు మాత్రం తమ అభిమాన హీరో కోసం ఎన్ని సంవత్సరాలు అయినా ఎదురు చూస్తూనే ఉంటారు. ఖుషీ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ తర్వాత రెండేళ్లు లాంగ్ గ్యాప్ తీసుకొని జానీ సినిమా చేశాడు. జానీ సినిమా కోసం అప్పట్లో యువత వేలం వెర్రెక్కి పోయింది. జానీ తర్వాత మరోసారి ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని గుడుంబా శంకర్ సినిమాలో నటించాడు. 2008లో వచ్చిన జ‌ల్సా తర్వాత రెండున్నర సంవత్సరాలు గ్యాప్ తీసుకుని కొమరం పులి సినిమాలో నటించాడు.

అజ్ఞాతవాసి తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి వచ్చి మూడేళ్ల తర్వాత వకిల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పవన్ సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ ఎంత బిజీగా ఉంటాడో తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 2004లో గుడుంబా శంకర్ సినిమా వచ్చింది. తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని పవన్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. ఈ సినిమా డైరెక్టర్ బైరిశెట్టి వీర‌ శంకర్‌కు పవన్ ఎలా ? ఛాన్స్ ఇచ్చాడు తెలిస్తే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. పవన్ గోకులంలో సీత సినిమా చేస్తున్న టైంలో వీరశంకర్ వెన్నెల్లో ఆడపిల్ల నవల ఆధారంగా శ్రీకాంత్ హీరోగా హలో ఐ లవ్ యు సినిమా రూపొందిస్తున్నారు.

అప్పటికే పవన్ వెన్నెల్లో ఆడపిల్ల నవల చాలా సార్లు చదివేసి ఉన్నారు. ఆ నవల అంటే పవన్ కు ఎంతో ఇష్టం. ఈ నవల ఆధారంగా సినిమా తీస్తున్న విషయం తెలుసుకున్న పవన్ పక్కనే షూటింగ్లో ఉన్న వీరశంకర్ ను ఒకరోజు పిలిచి సినిమా పూర్త‌య్యాక ప్రివ్యూ చూపిస్తావా అని సరదాగా అడిగారట. ఓకే అని చెప్పిన వీరశంకర్ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని హలో ఐ లవ్ యు ప్రివ్యూ షోకు పవన్‌ను పిలిచారట. వెంటనే పవన్ తన తల్లి అంజనమ్మ‌ను కూడా తీసుకు వస్తానని చెప్పడంతో వీరశంకర్ సంతోషం వ్యక్తం చేశారట.

హలో ఐ లవ్ యూ ప్రివ్యూ చూసిన పవన్ వీరశంకర్‌ను వాటేసుకుని మెచ్చుకోగా… పవన్ తల్లి అంజనమ్మ సైతం సినిమా బాగుందని వీరశంకర్ కు కితాబు ఇచ్చారట. అయితే వీర శంకర్ ఈ సినిమా తీసే టైం లో బ్యాచిలర్ గా ఉన్నారు. ఆ తర్వాత పవన్ దగ్గరకు పెళ్లి కార్డుతో వెళ్లారట. తన కోసం ఓ కథ రెడీ చేసుకోమని చెప్పగా మరదల‌పై కోపంతో కాల్ గర్ల్స్ ను ప్రేమించే నేపథ్యంలో వీరశంకర్ ఓ కథ‌ పవన్ కు వినిపించారట. అయితే ఆ కథ విషయంలో పవన్ కొన్ని మార్పులు చెప్పడంతో అది అక్కడితో ఆగిపోయింది.

ఆ త‌ర్వాత శ్రీహరి హీరోగా వీర శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుండ‌గా అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఖుషి షూటింగ్ కూడా జరుగుతోందట. అప్పుడు వీర శంకర్ ని చూసి ఆగిన పవన్ కళ్యాణ్ ఇంకా తన కోసం కథ రెడీ చేయలేదా ? మ‌దిలో ఏం ఐడియా త‌ట్ట‌లేదా ? అని ప్రశ్నించారు అట .అప్పుడు గుడుంబా శంకర్ కథ రెడీ చేసుకుని పవన్ కు వినిపిస్తే పవన్ చిన్న చిన్న మార్పులతో ఓకే చేశారట. అలా తమ కాంబినేషన్ సెట్ అయిందని వీరశంకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news