Newsఒకే ఏడాది 2 సార్లు పోటీ ప‌డ్డ ఎన్టీఆర్-ఏఎన్నార్‌..గెలుపు ఎవ‌రిది?

ఒకే ఏడాది 2 సార్లు పోటీ ప‌డ్డ ఎన్టీఆర్-ఏఎన్నార్‌..గెలుపు ఎవ‌రిది?

నంద‌మూరి తార‌క‌ రామారావు, అక్కినేని నాగేశ్వర రావు.. ఈ ఇద్ద‌రు అగ్రన‌టుల‌కు తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంత‌టి స్పెష‌ల్ ఇమేజ్ ఉందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఇద్ద‌రిలో ఎవ‌రు ఎక్కువ అంటే.. దానికి స‌మాధాన‌మే దొర‌క‌దు. ఎందుకంటే, ఎన్టీఆర్, ఏయ‌న్నార్‌ ఇద్దరూ టాలీవుడ్‌కు రెండుకళ్ళు లాంటి వారు. పైగా వీరిద్ద‌రూ మంచి మిత్రులు కూడా.

అయితే సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ తత్వం అనేది అప్ప‌ట్లో చాలా ఎక్కువగా ఉండేది. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్-ఏఎన్నార్ లు బాక్సాఫీస్ వద్ద పోటీ ప‌డ్డ సంద‌ర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఎన్టీఆర్ పైచేయి సాధిస్తే.. మరోసారి ఏఎన్ఆర్ జోరు చూపించేవారు. కొన్నిసార్లు ఇద్ద‌రూ స‌క్సెస్ అయ్యేవారు. ఇక ఓ ఏడాది ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు ఏకంగా రెండు సార్లు పోటీ ప‌డ్డారు.

సి.పుల్లయ్య ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ న‌టించిన ‘భువనసుందరి కథ’, పి.ఎస్.రామకృష్ణారావు డైరెక్ష‌న్ లో ఏఎన్నార్ చేసిన ‘గృహలక్ష్మి’ చిత్రాలు రెండూ 1967 ఏప్రిల్ 7న విడుద‌ల అయ్యాయి. అయితే వీటిలో భువనసుందరి కథ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిస్తే.. గృహ‌ల‌క్ష్మి మాత్రం ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది.

అయితే అదే ఏడాది మ‌ళ్లీ వీరిద్ద‌రూ బాక్సాఫీస్ పోరుకు సిద్ధం అయ్యారు. ఎస్.డి. లాల్ ద‌ర్శ‌క‌త్వంలో `నిండు మనసులు` అనే సినిమాను చేశారు ఎన్టీఆర్‌. దేవిక, రాజనాల, ఎల్.విజయలక్ష్మి, వాణిశ్రీ తదితరులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అలాగే మ‌రోవైపు ఏఎన్నార్ `వసంతసేన` అనే మూవీ చేశారు. బి.ఎస్.రంగా తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని విక్రం ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ రెండు సినిమాలు 1967లో ఒకేసారి విడుద‌ల అయ్యాయి. ఇక వీటిలో నిండు మనసులు హిట్ అవ్వ‌గా.. వసంతసేన బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. దీంతో ఆ ఏడాది బాక్సాఫీస్ ఫైట్‌లో ఏఎన్నార్‌ను ఓడించి ఎన్టీఆర్ గెలుపొందారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news