Moviesబాల‌య్య - ర‌వితేజ మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్ ... ఇంత‌క‌న్నా క్రేజీ కాంబినేష‌న్...

బాల‌య్య – ర‌వితేజ మ‌ల్టీస్టార‌ర్ ఫిక్స్ … ఇంత‌క‌న్నా క్రేజీ కాంబినేష‌న్ ఉంటుందా…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. అఖండ‌తో థియేట‌ర్ల ద‌గ్గ‌ర అఖండ గ‌ర్జ‌న మోగించిన బాల‌య్య ఇప్పుడు వ‌రుస పెట్టి క్రేజీ డైరెక్ట‌ర్ల‌తో సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. మ‌లినేని గోపీచంద్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న బాల‌య్య ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి సినిమాకు క‌మిట్ అయ్యారు. అనిల్ రావిపూడి – బాల‌య్య సినిమాపై రెండేళ్లుగా వార్త‌లు నానుతూనే ఉన్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఈ కాంబినేష‌న్ సెట్ అయ్యింది. బ్యాన‌ర్ ఏంట‌న్న‌ది క్లారిటీ లేదు కాని.. మ‌లినేని గోపీచంద్ త‌ర్వాత బాల‌య్య నెక్ట్స్ సినిమా దాదాపు అనిల్ రావిపూడిదే ఉంటుంది.

ఇటు అనిల్ రావిపూడి వ‌రుస సూప‌ర్ హిట్ల‌తో మామూలు ఫామ్‌లో లేడు. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 ప‌నుల్లో బిజీగా ఉన్నాడు. సినిమా షూటింగ్ ఎప్పుడో అయిపోయింది. సంక్రాంతికి రావాల్సిన సినిమా క‌రోనా కార‌ణంగాను.. ఇప్పుడు వ‌రుస‌గా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండ‌డంతో వాయిదా ప‌డింది. ఎట్ట‌కేల‌కు ఈ నెల 28న ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఆ తర్వాత అనిల్ బాల‌య్య సినిమా స్క్రిఫ్ట్ మీద కూర్చొంటాడు.

ఇక బాల‌య్య – అనిల్ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇది మ‌ల్టీస్టార‌ర్ అంటున్నారు. ఈ సినిమాలో బాల‌య్య‌తో పాటు మ‌రో హీరో కూడా ఉంటార‌ట‌. ఆ హీరో ఎవ‌రో కాదు మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌. ర‌వితేజ – బాల‌య్య కాంబినేష‌న్ అంటేనే మామూలు అరాచ‌కం కాదు. గ‌తంలో వీరిద్ద‌రి మ‌ధ్య ఏదో గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారం అయితే ఉంది. అయితే అన్‌స్టాప‌బుల్ షో వేదిక‌గా బాల‌య్య – ర‌వితేజ ఇద్ద‌రూ క‌లిసి ఇవ‌న్నీ పుకార్లే అని చెప్ప‌క‌నే చెప్పేశారు.

పైగా బాల‌య్య.. ర‌వితేజ‌ను ప్ర‌శ్న‌లు అడిగిన తీరుతో ర‌వితేజ సైతం ఫిదా అయిపోయాడు. ఇక అనిల్ రావిపూడితో గ‌తంలో ర‌వితేజ ఓ సినిమా చేసి ఉన్నాడు. రాజా ది గ్రేట్ వీరి కాంబినేష‌న్లో వ‌చ్చి సూప‌ర్ హిట్ అయ్యింది. చాలా రోజుల త‌ర్వాత ఆ సినిమాయే ర‌వితేజ‌కు ఊపిరి పోసింది. ఆ త‌ర్వాత మ‌రోసారి ర‌వితేజ‌తో సినిమా చేసేందుకు అనిల్ వెయిటింగ్‌లో ఉన్నాడు.

ఇక చాలా రోజుల నుంచి బాల‌య్య‌తో సినిమా చేయాల‌నేది అనిల్ క‌ల‌. ఎట్ట‌కేల‌కు ఈ క‌ల తీరుతోంది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో మ‌రో హీరోకు చోటు ఉండ‌డంతో ఇప్పుడు అనిల్ అనూహ్యంగా ర‌వితేజ‌తో ఆ స్టెప్ తీసుకుంటున్నాడు. మ‌రి ర‌వితేజ – బాల‌య్య కాంబినేష‌న్ అంటూ మామూలు ర‌చ్చ ఉండ‌దు. అనిల్ వీరి కాంబినేష‌న్ సెట్ చేస్తే అంత‌క‌న్నా క్రేజీ న్యూస్ ఏం ఉంటుంది..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news