Moviesఆ టాలీవుడ్ హీరో అంటేనే పిచ్చ ఇష్టం.. ర‌కుల్ సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌తో...

ఆ టాలీవుడ్ హీరో అంటేనే పిచ్చ ఇష్టం.. ర‌కుల్ సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌తో ర‌చ్చ‌..!

టాలీవుడ్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న చిన్న సినిమాల‌తో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది ర‌కుల్ ప్రీత్‌సింగ్‌. చాలా త‌క్కువ టైంలోనే ఇక్క‌డ పాపుల‌ర్ హీరోయిన్ అయిపోవ‌డంతో పాటు ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోలంద‌రి ప‌క్క‌న న‌టించేసింది. ఒకానొక టైంలో 2014 – 2017 మ‌ధ్య కాలంలో ర‌కుల్ స్టార్ హీరోల నుంచి.. టైర్ 2 రేంజ్ హీరోల వ‌ర‌కు ఆమే ఆప్ష‌న్‌. ఆమెతోనే సినిమాలు చేయాల‌ని హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా ప‌ట్టుబ‌ట్టేవారు. అలాంటిది ర‌కుల్ అన‌వ‌స‌రంగా టాలీవుడ్ ఛాన్సులు వ‌దులుకుని బాలీవుడ్ అవ‌కాశాల కోసం వెంప‌ర్లాడింది. అక్క‌డ ఒక‌టీ రెండు ఛాన్సులు మిన‌హా ఆమెను ప‌ట్టించుకున్న వాళ్లే లేరు.

త‌ర్వాత తిరిగి టాలీవుడ్‌కు రావాల‌ని అనుకున్నా కుర్ర హీరోయిన్ల దెబ్బ‌తో ర‌కుల్‌ను ప‌ట్టించుకునే వాళ్లే లేకుండా పోయారు. దీంతో ఆమె ఇక్క‌డ ఫేడ‌వుట్ అయిపోయింది. అయితే ర‌కుల్ సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉండ‌డంతో పాటు పోస్టులు పెడుతూ ఉంటుంది. హాట్ హాట్‌గా క‌వ్వించేందుకే ట్రై చేస్తూ ఉంటుంది. ర‌కుల్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసే ఫొటోలు, స్టిల్స్ నెట్టింట్లో మామూలుగా వైర‌ల్ కావు. ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో త‌న అందాలు ఆర‌బోస్తూ తాను లైమ్‌టైమ్‌లో ఉన్నాను.. త‌న‌ను గుర్తు పెట్టుకోండి అని చెప్పేందుకు తాప‌త్ర‌య ప‌డుతూనే ఉంటుంది.

ఇక కొంద‌రు అభిమానులు అయితే ఆమెను కొన్ని ఇంట్ర‌స్టింగ్ ప్ర‌శ్న‌ల‌తో రెచ్చ‌గొడుతూనే ఉంటారు. ర‌కుల్ కూడా ఆ ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన స్టైల్లో ఆన్స‌ర్లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె చిట్‌చాట్‌లో ఇచ్చిన ఆన్స‌ర్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ రంబోలాగా మారాయి. త్రిబుల్ ఆర్ సినిమాను తాను బాగా ఎంజాయ్ చేశాన‌ని.. ఈ సినిమాలో ప్ర‌తి ఒక్క‌రు ఎంతో అద్భుతంగా న‌టించారు అని… సినిమా సూప‌ర్ అంటూ కామెంట్స్ చేసింది.

ఈ క్ర‌మంలోనే ఓ నెటిజ‌న్ తెలుగు ఇండ‌స్ట్రీలో మీరు అభిమానించే హీరో ఎవ‌రు ? అన్న ప్ర‌శ్న వేశాడు. ఈ ప్ర‌శ్న‌కు ర‌కుల్ ఠ‌క్కున అల్లు అర్జున్ పేరు చెప్పేసింది. వీరిద్ద‌రు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌రైనోడు సినిమాలో క‌లిసి న‌టించారు. నిజానికి ఇది యాక్ష‌న్ సినిమా కావ‌డంతో ఇందులో వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీకి అంత ఛాన్స్ కూడా లేదు. రొమాన్స్‌కు కూడా పెద్ద‌గా స్కోప్ లేదు. అయినా కూడా అల్లు అర్జున్‌కు ర‌కుల్ బాగా క‌నెక్ట్ అయిపోయిన‌ట్టు ఉంది.

ర‌కుల్ లాంటి క్రేజీ హీరోయిన్ త‌మ అభిమాన హీరో అంటే ఇష్టం అని చెప్ప‌డంతో ఇక బ‌న్నీ అభిమానులు ఊరుకుంటారా ? సోష‌ల్ మీడియాలో దుమ్ము రేపేస్తున్నారు. స్టార్ హీరోయిన్‌కు బెస్ట్ హీరో అయిన త‌మ హీరో గ్రేట్ అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురిపించేస్తున్నారు. మామూలుగా ఓ హీరో సినిమా ఎంత పెద్ద హిట్ అయినా.. ఎన్ని అవార్డులు వ‌చ్చినా కూడా ఓ హీరోయిన్ నాకు ఆ హీరో ఇష్టం అని ఓపెన్‌గా చెపితే ఆ ఫ్యాన్స్‌కు అంత‌కు మించిన కిక్ ఉండ‌దు క‌దా ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news