Moviesఅభిషేక్ బచ్చ‌న్ ఫోన్ నుంచి మ‌రో హీరోయిన్‌కు ప్రియాంకచోప్రా మెసేజ్‌.. ఆ...

అభిషేక్ బచ్చ‌న్ ఫోన్ నుంచి మ‌రో హీరోయిన్‌కు ప్రియాంకచోప్రా మెసేజ్‌.. ఆ త‌ర్వాత అదిరే ట్విస్ట్‌..!

బాలీవుడ్‌లో పాపుల‌ర్ హీరోయిన్ల‌లో ప్రియాంక చోప్రా ఒక‌రు. బాలీవుడ్‌ను దాదాపు ద‌శాబ్దంన్న‌ర పాటు ప్రియాంక ఓ ఊపు ఊపేసింది. త‌ర్వాత ఆమెరికాకు చెందిన వ‌య‌స్సులో త‌న కంటే చిన్న‌వాడు అయిన నిక్కీని ప్రేమ వివాహం చేసుకుని అక్క‌డ సెటిల్ అయిపోయింది. వ‌య‌స్సులో త‌న కంటే ప‌దేళ్లు చిన్న‌వాడు అయిన నిక్కీతో ఆమె ప్రేమ‌లో ప‌డ‌డం పెద్ద సంచ‌ల‌నం. బాలీవుడ్‌ను దున్నేసిన ప్రియాంక హాలీవుడ్‌లో అడుగు పెట్టి అక్క‌డ కూడా సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది.

హాట్ హాట్‌గా న‌టించ‌డంలోనూ, క్లీవేజ్ షోలు చేయ‌డంలోనూ , భ‌ర్త‌తో కిలిసి బీచ్‌లో రెచ్చిపోయే దుస్తులు వేసుకోవ‌డంలోనూ ప్రియాంక ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా ఆమె పాత ఇంట‌ర్వ్యూ వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్ర‌ముఖ యాంక‌ర్ సిమీ గారేవాల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో లింక్ షేర్ చేసింది. ప్రియాంక చోప్రా బాలీవుడ్ స్టార్ అభిషేక బచ్చ‌న్ జంటగా 2006లో బ్ల‌ఫ్ మాస్ట‌ర్ సినిమా వ‌చ్చింది.

ఆ సినిమా షూటింగ్ టైంలో అభిషేక్ ఎక్కువుగా ఫ్రాంక్ చేసేవాడ‌ట‌. ఓ సారి ప్రియాంక ఫోన్‌ను దాచేసి ఏం తెలియ‌న‌ట్టే ఉన్నాడ‌ట‌. చాలా సేపు ఏడిపించాక కాని ఫోన్ ఇవ్వ‌లేద‌ట‌. అభిషేక్‌పై రివేంజ్ తీర్చుకోవాల‌ని డిసైడ్ అయిన ప్రియాంక బంట్ ఔర్ బ‌బ్లీ మూవీలో అభిషేక్‌తో క‌లిసి న‌టించిన రాణీముఖ‌ర్జీకి మెసేజ్ చేసింద‌ట‌. ఎక్క‌డ ఉన్నావు.. నేను నిన్ను మిస్ అవుతున్నా అని మెసేజ్ చేసి వెంట‌నే ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింద‌ట‌.

అయితే ఆ ఇంట‌ర్వ్యూలో ప్రియాంక తాను ఏ న‌టికి మెసేజ్ చేసింది చెప్ప‌లేదు. ఇంట‌ర్వ్యూ చేస్తోన్న సిమీ మాత్రం రాణికే క‌దా అని గెస్ చేయ‌డంతో ప్రియాంక ఎస్ అన్న‌ట్టుగా త‌లూపింది. అందుకు రాణి రిప్లే ఇస్తూ హాయ్ బేబీ నీకు ఏమైంది అని అభిషేక్‌కు రిప్లే ఇచ్చింద‌ట‌. అయితే ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది ? అన్న‌ది మాత్రం ఆ వీడియోలో వెల్ల‌డించ‌లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news