Moviesఅతి తెలివితేట‌ల‌తో నిర్మాత‌ల‌ను ముంచేస్తోన్న టాలీవుడ్ స్టార్ హీరో..!

అతి తెలివితేట‌ల‌తో నిర్మాత‌ల‌ను ముంచేస్తోన్న టాలీవుడ్ స్టార్ హీరో..!

టాలీవుడ్‌లో అత‌డో మీడియం రేంజ్ హీరో.. ఒక‌ప్పుడు చిన్నా చిత‌కా వేషాలు వేసుకున్న అత‌డు పూరి జ‌గ‌న్నాథ్ పుణ్య‌మా అని మూడు హిట్లు ప‌డ‌డంతో ఒక్కసారిగా యూత్‌లో క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరో అయ్యాడు. ఒకానొక టైంలో వ‌రుస ప్లాపుల‌తో కెరీర్‌లో బాగా వెన‌క‌ప‌డిపోయాడు. ఆ త‌ర్వాత ఒక్క హిట్ రావ‌డంతో మ‌ళ్లీ రెమ్యున‌రేష‌న్ బాగా పెంచేశాడు. గ‌తేడాది క‌రోనా టైంలో కూడా ఓ హిట్ ప‌డ‌డంతో మ‌ళ్లీ రేటు పెంచేశాడు. అస‌లు అత‌డికి రు. 8 కోట్ల‌కు మించిన రెమ్యున‌రేష‌న్ లేదు. అలాంటిది ఇప్పుడు రు. 12 కోట్లు చెపుతున్నాడు.

గ‌తేడాది హిట్ సినిమా చూపించుకుని ఇటీవ‌ల రిలీజ్ ఓ సినిమాకు రు. 12 కోట్లు ముక్కు పిండీ వ‌సూలు చేశాడ‌ట‌. పైగా సినిమా రెమ్యున‌రేష‌న్ అంతా ముందే ఇచ్చేయాల‌ని కండీష‌న్ పెట్ట‌డంతో నిర్మాత స‌రే అన్నాడు. అయితే ఈ సినిమాకు అనుకున్న‌దానికంటే ఎక్కువ బిజినెస్ జ‌రిగింది. ఇదంతా త‌న వ‌ల్లే అని.. మ‌రో రు. 2 కోట్లు ఇస్తే కాని డ‌బ్బింగ్ చెప్ప‌న‌ని కండీష‌న్ పెట్ట‌డంతో చివ‌ర‌కు నిర్మాత ఛాంబ‌ర్‌లో కంప్లైంట్ చేయాల‌ని అనుకున్నా ఈ గొడ‌వ‌తో సినిమాపై ఎక్క‌డ ఎఫెక్ట్ ప‌డుతుందో అనుకుని చివ‌ర‌కు ఆ రు. 2 కోట్లు ఇచ్చేసి డ‌బ్బింగ్ చెప్పించుకున్నాడు.

ఇంత చేసినా కూడా స‌ద‌రు హీరో ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ద‌ర్శ‌కుడు, నిర్మాత‌పై సెటైర్లు వేశాడు. క‌ట్ చేస్తే సినిమా ఘోరంగా బాల్చీ త‌న్నేసింది. ఇప్పుడు వ‌రుస‌గా మూడు నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. నిర్మాత‌ల‌కు చుక్కుల చూపించేస్తున్నాట‌. ఇక త్వ‌ర‌లో రిలీజ్ కాబోతున్న సినిమాకు రోజావారి రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ట‌. నిర్మాత‌లు రోజుకు రు. 50 ల‌క్ష‌లు చొప్పున 25 రోజుల్లో పూర్తి చేసేయాల‌ని నిర్మాత‌లు అనుకున్నార‌ట‌.

అయితే ఇప్ప‌టికే 33 రోజుల పాటు స‌ద‌రు హీరో షూటింగ్ పూర్తి చేశాడు. మ‌రో మూడు రోజుల పాటు ప్యాచ్ వ‌ర్క్ చేయాల‌ట‌. సినిమాకు ఇంత అని మాట్లాడుకుంటే రు. 15 కోట్లు కావాల‌ని అడ‌గ‌డంతో నిర్మాత‌లు రోజు వారి రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశారు. ఇప్పుడు ఇది ఏకంగా రు. 19- 20 కోట్ల వ‌ర‌కు వెళుతోంది. ఇప్ప‌టికే నిర్మాత‌కు భారీగా చేతిచ‌మురు వ‌దిలింది. ఇక స‌ద‌రు హీరోగారి తాజా సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఈ సినిమాకు బిజినెస్ కూడా అనుకున్న రేంజ్‌లో జ‌ర‌గ‌డం లేద‌ని టాక్ ? ఇక ఓటీటీకి ఇచ్చే ఆలోచ‌న కూడా చేస్తున్నారు.

ఇక స‌ద‌రు హీరో చేతిలో ఉన్న సినిమాల‌కు కూడా రు. 15 కోట్లకు పైనే రెమ్యున‌రేష‌న్ అడుగుతున్నాడ‌ట‌. ఏదేమైనా క‌థ‌లతో సంబంధం లేకుండా ఎలాంటి చెత్త క‌థ‌లు వ‌చ్చినా ఎక్కువ ఎక్కువ డ‌బ్బులు ఇస్తే వాళ్ల‌కే సినిమాలు చేస్తున్నాడ‌ట‌. ఇప్పుడు స‌ద‌రు హీరో అతి తెలివితేట‌ల‌తో నిర్మాత‌లు నిండా మునిగిపోతున్నార‌న్న టాపికే ఎక్కువుగా ఇండ‌స్ట్రీలో వైర‌ల్ అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news