Moviesరౌడీ పోలీస్‌గా బాల‌య్య‌.. అదిరిపోయే మాస్ క‌థ‌తో ఫ్యాన్స్‌కు పూన‌కాలే..!

రౌడీ పోలీస్‌గా బాల‌య్య‌.. అదిరిపోయే మాస్ క‌థ‌తో ఫ్యాన్స్‌కు పూన‌కాలే..!

వ‌రుస విజ‌యాల‌తో జోరుమీదున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేశాడు. ఏప్రిల్ 28 రిలీజ్ అంటున్నారు. ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి వ‌ర్క్ అంతా బాల‌య్య సినిమా మీదే స్టార్ట్ చేస్తాడు. బాల‌య్య‌తో సినిమా కోసం అనిల్ రావిపూడి రెండేళ్లుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. క‌రోనా ఫ‌స్ట్ లాక్ డౌన్ టైంలోనే రామారావు గారు అన్న టైటిల్‌తో ఓ క‌థ చెప్పాడు. ఆ క‌థ ఎందుకో గాని బాల‌య్య‌కు ఎక్క‌లేదు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా మరో క‌థ రెడీ చేసి బాల‌య్య‌కు వినిపించాడు.

ఈ క‌థ బాల‌య్య‌కు బాగా న‌చ్చింది. చిన్న చిన్న మార్పులు కూడా చేశాడు. ప్ర‌స్తుతం బాల‌య్య .. మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 107వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాతే అనిల్ రావిపూడి సినిమా ఉంటుంది. ఈ సినిమాను దిల్ రాజు త‌న బ్యాన‌ర్లో నిర్మించేందుకు ట్రై చేస్తున్నాడు. అయితే క‌ళ్యాణ్‌రామ్ సైతం ఈ కాంబినేష‌న్లో సినిమాను త‌న బ్యాన‌ర్లో చేసేందుకు రెడీ అవుతున్నాడు. క‌ళ్యాణ్‌రామ్ తానే ఈ సినిమా చేస్తానంటే అనిల్ రావిపూడి, బాల‌య్య ఇద్ద‌రూ కాద‌న‌రు. ఎందుకంటే క‌ళ్యాన్ ఈ ఇద్ద‌రికి కావాల్సిన వాడే..!

అనిల్ రావిపూడి ప‌టాస్ సినిమాలో క‌ళ్యాణే హీరో. ఇది అనిల్‌కు డైరెక్ట‌ర్‌గా ఫ‌స్ట్ సినిమా..! ఇక ఇప్ప‌టికే బాల‌య్య‌తో చేసే సినిమా స్క్రిఫ్ట్ వ‌ర్క్‌లో అనిల్ త‌ల‌మున‌క‌లై ఉన్నాడ‌ట‌. అయితే సినిమా క‌థ ఏంటి ? బాల‌య్య పాత్ర ఎలా ? ఉంటుంది ? అన్న‌దానిపై అప్పుడే ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అనిల్ రావిపూడి మాత్రం ఈసారి ప‌క్కా మాస్ సినిమా తీస్తా అని ప్ర‌క‌టించేశాడు. ఇక మ‌న‌కు విన‌ప‌డుతోన్న స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో బాల‌య్య పోలీస్ ఆఫీస‌ర్‌గా కనిపిస్తాడ‌న్న ప్రచారం అయితే స్టార్ట్ అయ్యింది.

అనిల్ రావిపూడి ప‌టాస్ సినిమా పోలీస్ ఆఫీస‌ర్ క‌థే. అందులో హీరోను నెగిటివ్ యాంగిల్లో చూపించ‌డంతో పాటు.. కావాల్సినంత కామెడీ యాంగిల్ జోడించి సూప‌ర్ హిట్ చేశాడు. ఇప్పుడు బాల‌య్య సినిమాను కూడా ప‌టాస్ స్టైల్లోనే న‌డిపిస్తాడ‌ట‌. బాల‌య్య ఇది వ‌ర‌కు చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించాడు. రౌడీ ఇన‌స్పెక్ట‌ర్‌, ల‌క్ష్మీ న‌ర‌సింహా చిత్రాల‌లో బాల‌య్య పోలీస్ పాత్ర‌లు బాగా పండాయి. ఇప్పుడు ఈ సినిమాలో ఆ రెండు సినిమాల‌ను మించిన రేంజ్‌లో పోలీస్ పాత్ర ఉండ‌బోతోంద‌ట‌.

అటు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఎలాగూ మాస్ క‌థ‌తో సినిమా చేస్తాన‌ని చెప్పారు. బాల‌య్య‌కు ఎంత బ‌ల‌మైన మాస్ క‌థ ఉంటే అంత బాగుంటుంది. అఖండ అరాచ‌కం చూశాం. ఇప్పుడు మ‌లినేని గోపీచంద్ సినిమా కూడా అలాగే ఉండ‌బోతోంది. రేపు అనిల్ రావిపూడి కూడా మాస్ హీరోయిజంకు కామోడీ జోడిస్తే ఫ్యాన్స్‌కు మామూలు పూన‌కాలు రావు. ఇక వ‌చ్చే యేడాది స్టార్టింగ్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news