Moviesఈ టాలీవుడ్ హీరోయిన్‌ కొత్త దోపిడీ మామూలుగా లేదే.. నిర్మాత‌ల‌ను నాకేస్తోందిగా...!

ఈ టాలీవుడ్ హీరోయిన్‌ కొత్త దోపిడీ మామూలుగా లేదే.. నిర్మాత‌ల‌ను నాకేస్తోందిగా…!

తెలుగులో హీరోలు ఎక్కువ‌. ఒక్కో ఫ్యామిలీ నుంచే రెండో త‌రం. మూడో త‌రం హీరోలు కూడా ఇప్పుడు హీరోలుగా కంటిన్యూ అవుతున్నారు. కొణిదెల‌, నంద‌మూరి, అక్కినేని వంశాల్లో రెండు త‌రాల హీరోలు ఇప్పుడు కొన‌సాగుతున్నారు. కొంద‌రు హీరోయిన్లు అయితే అటు తండ్రితోనూ, ఇటు కొడుకుతోనూ జ‌ట్టుక‌ట్టేస్తున్నారు. మెగా ఫ్యామిలీలోనూ మామ‌తోనూ, అల్లుళ్లు, కొడుకుల‌తోనూ జోడీ క‌డుతోన్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. హీరోలు ఇక్క‌డ ఎక్కువైపోయారు.. హీరోయిన్లు త‌క్కువైపోయారు. వాళ్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చ‌లేని ప‌రిస్థితి. పైగా ఇక్క‌డ హీరోయిన్లు మ‌న వాళ్ల‌కు న‌చ్చ‌రు. పాన్ ఇండియా అనో మ‌రొక‌టి అనో బాలీవుడ్ హీరోయిన్ల‌ను.. లేదా క‌న్న‌డ హీరోయిన్ల‌ను దిగుమ‌తి చేసుకుంటూ ఉంటారు.

అస‌లు ర‌ష్మికకు సొంత భాష క‌న్న‌డం కంటే తెలుగులో న‌టించాకే క్రేజ్ వ‌చ్చింది. తెలుగులు రెండు హిట్లు ప‌డ్డాక అంద‌రూ ఆమె వెంట ప‌డుతుండ‌డంతో ఆమె కొండెక్కేసింది. రెమ్యున‌రేష‌న్ పెంచేసి డిమాండ్ల మీద డిమాండ్లు చేస్తోంది. ఓ హీరోయిన్‌కు రెండు, మూడు హిట్లు వ‌స్తే చాలు ఇక అంద‌రూ ఆమె వెంటే ప‌డుతున్నారు. స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వ‌ర‌కు అంద‌రూ ఆ హీరోయిన్ చుట్టూనే ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. అటు డైరెక్ట‌ర్‌కు ఆ హీరోయ‌నే కావాలి.. ఇటు హీరోకు ఆ హీరోయిన్ అంటేనే మోజు.. ఇంకేముంది.. ఆమె ఆడింది ఆట‌.. పాడింది పాట అవుతోంది.

న‌య‌న‌తార‌కు తెలుగులో క్రేజ్ వ‌చ్చాకే త‌మిళంలో స్టార్ హీరోయిన్ అయ్యింది. అనుష్క కొంత వ‌ర‌కు నిర్మాత‌ల‌కు అందుబాటులోనే ఉండేది. ర‌ష్మిక‌, పూజా హెగ్డే తెలుగులో వ‌చ్చిన క్రేజ్‌తోనే ఈ రోజు స్టార్ హీరోయిన్లు అయ్యారు. ఇప్పుడు కొంద‌రు హీరోయిన్ల‌కు తెలుగు నిర్మాత‌లు అంటే పెద్ద చుల‌క‌న అయిపోయింద‌ట‌. వాళ్లతో పాటు వాళ్ల అమ్మో లేదా కుటుంబ స‌భ్యులు కూడా ఒక‌రు వారి వెంటే ఉంటార‌ట‌. వాళ్ల‌కు కూడా ఫ్లైట్ ఖ‌ర్చులు, ఖ‌రీదైన రూమ్‌లు, త‌మ వ్య‌క్తిగ‌త సిబ్బంది జీతాలు, వాళ్ల రోజువారి ఖ‌ర్చులు, ఇత‌ర వ‌స‌తులు అన్నీ నిర్మాత‌ల అక్కౌంట్లలోనే వేసేస్తున్నార‌ట‌.

ఇక ఇటీవ‌ల ఓ స్టార్ హీరోయిన్ సెట్‌కు బౌన్స‌ర్ల‌తో క‌లిసి రావ‌డంతో అక్క‌డున్న వాళ్లు అవాక్క‌య్యారు. వాళ్ల ఖ‌ర్చుల‌ను కూడా నిర్మాత‌నే చెల్లించ‌మ‌న‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఈ దోపిడీ మ‌రో కొత్తం రూపంలోకి వెళ్లిపోయింది. ప్ర‌తి సినిమాకు ఓ కాస్ట్యూమ్ డిజైన‌ర్ ఉంటాడు. ఆ డిజైన‌రే సినిమాలో ప్ర‌తి ఒక్క‌రికి కావాల్సిన కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తాడు.

అయితే ఇటీవ‌లే వ‌చ్చిన ఓ డిజాస్ట‌ర్ సినిమాలో న‌టించిన ఓ స్టార్ హీరోయిన్ త‌న‌కంటూ వ్య‌క్తిగ‌తంగా ఓ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌ను తెచ్చుకుంద‌ట‌. అయితే ఇప్పుడు ఆమె సొంత డిజైన‌ర్ ఇచ్చిందే డ్రెస్సు.. అదే కాస్ట్యూమ్‌.. వాళ్లు ఇచ్చిందే బిల్లు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే ఆమె త‌ల పొగ‌రు త‌నంతో స‌ద‌రు డిజాస్ట‌ర్ సినిమా హీరోయే ఆమెతో మాట్లాడ‌లేద‌న్న ప్ర‌చారం ఉంది. ఇక ఇప్పుడు ఆమె తెచ్చుకున్న డిజైన్ల‌కు రు. 15 ల‌క్ష‌ల‌కు పైగా బిల్లులు అవుతున్నాయ‌ట‌. నిర్మాత‌ల‌కు భారీగా చేతిచ‌మురు వ‌దులుతుండ‌డంతో వాళ్లంతా ల‌బోదిబో మంటున్నారు.

కాదూ కూడ‌దు.. అని చెపుదామంటే హీరో, ద‌ర్శ‌కుల‌కు ఆ హీరోయినే కావాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో నిర్మాతలు కూడా కిమ్మ‌న‌కుండా ఆ హీరోయిన్ చెప్పింద‌ల్లా చేయ‌డం మిన‌హా చేసేదేం లేద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news