Moviesహగ్గులు, ముద్దులు..నాగార్జున అంటే అందుకే నాకు అసహ్యం..పరువు తీసేసాడుగా..!!

హగ్గులు, ముద్దులు..నాగార్జున అంటే అందుకే నాకు అసహ్యం..పరువు తీసేసాడుగా..!!

సీపీఐ నారాయణ ఈయన గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. నిత్యం ఏదో ఒక్క వార్తలతో మీడియాలో కనిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటారు. అయితే సమాజంలో జరిగే ప్రతి అన్యాయాని వేలు ఎత్తి చూపే ఈఅయనకు మొదట నుండి బిగ్ బాస్ షో అంటే కోపం. అంతా ఇంతా కాదండోయ్..బిగ్ బాస్ వచ్చిన ప్రతిసారి కూడా నారాయణ ఒక వీడియో విడుదల చేస్తుంటారు. ఇక అందులో బిగ్ బాస్ ను తిట్టిపోస్తుంటారు. రీసెంట్ గా ఓ ప్రముఖ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యుల్లో ఆయనకు బిగ్ బాస్ గురించిన ప్రశ్నలు ఎదురవ్వగా..ఆయన కోపంతో ఊగిపోయారు.

ఎప్పుడు లేనంత కోపంగా రియాక్ట్ అయిన అది షో కాదు..నారాయణ..ఈసారి మాటలు కాస్త హద్దు దాటాయి అనే అంటున్నారు నెటిజన్స్. ఇంతకి నారాయణ బిగ్ బాస్ గురించి ఏమన్నాడొ తెలుసా..బిగ్ బాస్ షో అసలు గేం షో కాదు అని..అది ఓ బ్రోతల్ హౌస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు నారాయణ. అక్కడితో ఆగారా అంటే లేదు.. మరో మెట్టు ముందుకేసి ఈ సారి ఏకంగా హోస్ట్ గా చేస్తున్న స్టార్ హీరో నాగార్జున పై ఎవ్వరు ఊహించని కామెంట్స్ చేసారు.

అంతేకాదండోయ్.. మధ్యలోకి నాగార్జున ఫ్యామిలిని కూడా తీసుకొచ్చార్ ఈయన. ముగ్గురు అమ్మాయిల ఫోటోలు చూయించి ఏ అమ్మాయితో డెటింగ్ చేస్తావ్..? ఏ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటావ్..? ఏ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావ్..? అని అడిగే నాగార్జున ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా..వాళ్ళ ఫోటోలు అలా పెడతారా.. అస్సలు ఇది బిగ్ బాస్ షో కానే కాదు అని అది ఓ బ్రోతల్ హౌస్ అని కన్నెర్రజేశారు.

అసలు బిగ్ బాస్ షో అంటే ఇదేనా ఏమైనా ఉపయోగం ఉందా అంటూ నారాయణ మండిపడ్డారు. తనకు నాగార్జున అంటే కోపం కాదని అసహ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు.. అదో పెద్ద అనైతిక షో అని, బూతుల ప్రపంచం అని ..బిగ్ బాస్ లాంటి సాంసృతిక హీనమైన ప్రోగ్రామ్స్ అరికట్టాలని కొరారు. ఇక కెంద్ర ప్రభుత్వం నే కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించాలని డిమాండ్‌లు చేసి వార్తల్లో నిలిచారు నారాయణ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news