Moviesహీరోయిన్ ను అలా చేసే ఛాన్స్ వస్తే.. బాబోయ్ ఈ స్టార్...

హీరోయిన్ ను అలా చేసే ఛాన్స్ వస్తే.. బాబోయ్ ఈ స్టార్ నిర్మాత బోల్డ్ ఆన్సర్ వినలేం(వీడియో) ..!!

ప్రస్తుతం ఉన్న పరిస్ధితులు చూస్తుంటే సినీ ఇండస్ట్రీలో మనుషులు కొంతమంది రోజు రోజుకు దిగజారిపోతున్నట్లు అనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. సినిమా కంటెంట్ విషయలల్లో చూసిన అదే తీరు.. ఆడియో ఫంక్షన్ లల్లో చూస్తే చిట్టి పొట్టి బట్టలు..దాని చూసి కామెంట్స్ చేసే జనాలు. ఇక ఈ మధ్య కాలంలో రిపోర్టర్లు కూడా హాట్ ప్రశ్నలు అడుగుతూ సినీ ఇండస్ట్రీలో మరింత హీట్ పుట్టిస్తున్నారు. ఇక నటీ నటులే కాదు డైరెక్టర్లు కూడా బోల్డ్ గా ఆన్సర్ ఇస్తూండడం గమనార్హం.

ఈ మధ్య కాలంలో హారిక హాసిని అనుబంధ సంస్థ సీతారా ఎంటర్టైన్మెంట్స్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాయి. ఈ క్రమంలోనే నగవంశీ సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. యువ నిర్మాతగా మంచి క్రేజ్ అందుకుంటున్న నాగవంశీ చాలమంచి సినిమాలను నిర్మిస్తున్నాడు. డిఫరెంట్ సినిమాలు నిర్మించడమే కాదు..కొత్త టాలెంట్ ను ప్రొత్సహిస్తూ కొత్త వారికి కూడా అవకాశాలు ఇస్తున్నాడు.

ఇక ఈయన భీమ్లా నాయక్ సినిమాకు నిర్మాత గా ఉన్న విషయంతెలిసిందే. ముందు నుండి నాగవంశీ భీమ్లా నాయక్ విషయంలో ఎంత దూకుడుగా ఉన్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య ఓ రిపోర్టర్ భీమ్లా నాయక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న ప్రశ్నకు..అది జగన్ చేతుల్లో ఉంది అంటూ ఘాటుగా ఆన్సర్ ఇచ్చి అందరి మైండ్లు బ్లాక్ చేశాడు.

ఇక ఈయన నిర్మిస్తున్న మరో సినిమా డీజే టిల్లు కూడా ఈ మధ్య నెట్టింట తెగ మారుమ్రోగిపోతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగ వంశీ మాట్లాడిన మాటలు ఇండస్ట్రీ పెద్దలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అస్సలే హీరోయిన్ ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో చూశావా అంటూ ఓ రిపోర్టర్ అడిగిన ప్రశన పెద్ద దుమారమే రేపుతుంటే.. మరో వైపు నిర్మాత నాగ వంశీ రిపోర్టర్ కు ఇచ్చిన ఆన్సర్ కూడా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

డీజే టిల్లు సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన నాగవంశీని రిపోర్టర్ డిజే టిల్లు సినిమా మీ బయోపిక్ అనుకోవచ్చా అని ఒక విలేకరి అడగడంతో.. ఇంత అందమైన అమ్మాయిని ముద్దుపెట్టుకునే అవకాశం వస్తే నేనే యాక్ట్ చేస్తాను అంటూ దిమ్మతిరిగెలా ఆన్సర్ ఇచ్చారు. సాధారణంగా నాగవంశీ చాలా సైలెంట్..కానీ ఊహించని విధంగా ఇలా మాట్లాడేసరికి ఆయన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news