Moviesవామ్మో..ఆ యాడ్ కోసం మహేష్ బాబు అన్ని కోట్లు తీసుకున్నాడా..?

వామ్మో..ఆ యాడ్ కోసం మహేష్ బాబు అన్ని కోట్లు తీసుకున్నాడా..?

టాలీవుడ్ లో మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఘట్టమనేని వారసుడిగా ఇండస్టృఈలోఖి అడుగు పెట్టిన ఈయన ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోల లిస్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం పరశూరం డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న మహేష్.. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తో కలిసి ఓ అడ్వెంచర్ సినిమాలో నటించబోతున్నారు. ఇలా వరుసగా సినిమాలను చేస్తూనే మరోవైపు యాడ్స్ కూడా నటిస్తూ.. రెండు చేతులా సంపాదిస్తున్నారు.

ఇప్పటికే చాలా యాడ్స్ లో కనిపించి సందడి చేసిన మహేష్ రీసెంట్ డేస్ లోనే రెండు కొత్త యాడ్స్ తో సందడి చేశాడు. గ‌తంలో థ‌మ్స‌ప్ యాడ్‌లో ఇర‌గ‌దీసిన మ‌హేశ్ బాబు ఇప్పుడు మౌంట్ అండ్ డ్యూ కు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయడు. దీన్ని హాలీవుడ్ రేంజ్‌లో దుబాయ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక బుర్జ్ ఖలీఫా దగ్గర షూట్ చేశారు. హిందీలో ఈ యాడ్ హృతిక్ రోషన్ చేశాడు. మౌంటెన్ డ్యూ యాడ్ చేసి హాలీవుడ్ రేంజ్ లో స్టంట్ చేయడం జరిగింది. ఈ యాడ్ కి సంబంధించిన వీడియో… తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి… యాడ్ చేస్తున్న సమయంలో తనకు ఎంతగానో కిక్కు వచ్చిందని…ఆనందాన్ని కలిగించిందని తెలిపాడు.

భ‌యానికి భ‌య‌ప‌డితే ఏ సాహ‌స‌మూ చేయ‌లేమ‌ని మ‌హేశ్ సందేశం ఇచ్చాడు. ఇప్పుడు ఏ యాడ్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. గత ఏడాది కూడా ఈ బ్రాండ్ ఆయనే ప్రమోట్ చేశాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే తెలుగులో ఏడాది పాటు మౌంటెన్ డ్యూ సాఫ్ట్ డ్రింక్ ప్రమోట్ చేయడానికి మహేష్ ఏకంగా 12 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇది కొంచెం ఎక్కువే అయినా మహేష్ చేసిన సహసానికి ఆయనకి ఉన్న క్రేజ్ కు ఆ మాత్రం ఇవ్వడం లో తప్పు లేదు అంటున్నారు అభిమానులు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news