Moviesఅయ్య బాబోయ్..మీకు తెలుసా..తమన్నా అస్సలు ఆపుకోలేదట..?

అయ్య బాబోయ్..మీకు తెలుసా..తమన్నా అస్సలు ఆపుకోలేదట..?

తమన్నా..ఈ పేరు కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన నటనతో..టాలెంట్ తో తనదైన స్టైల్లో యాక్ట్ చేసి..కోట్లాది మంది ప్రేక్షకులను సొంతం చేసుకుంది. ఈ రోజుల్లో ఓ హీరోయిన్ ఐదేళ్ల కొనసాగిస్తేనే అమ్మో అంటారు. అలాంటిది ఒకటిన్నర దశాబ్ధం నుంచి సినిమాలు చేస్తూనే ఉంటుంది తమన్నా నిజంగా గ్రేట్ అని చెప్పాల్సిందే. తమన్నా తన 15 సంవత్సరాల వయస్సు లో “చాంద్ సా రోషన్ చెహ్రా “హిందీ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత సక్సెస్ ఫుల్ “శ్రీ ” (2005 ) మూవీ తో టాలీవుడ్ కు , “కేడి “(2006 )మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. అయితే ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపి డేస్ సినిమాతో దక్కించుకుంది.

ఇక ఆ తరువాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా ముందుకు వెళ్తూనే ఉంది. తెలుగు , తమిళ భాషలలో పలు మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 16 ఏళ్లు గడుస్తోన్న ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్‌ దక్కించుకుంటూ దూసుకుపోతోంది అందాల తార తమన్నా. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో కలిసి నటించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం తమన్నా చిరంజీవి పక్కన భోళా శంకర్ సినిమాలో..వెంకటేష్ పక్కన ఎఫ్ 3 సినిమాలో నటిస్తుంది. ఇంకొన్ని సినిమాలను లైన్లో పెట్టి ఉంది.

అయితే ఈ బ్యూటీకి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంత స్లిం గా ఇంతటి పర్ ఫెక్స్ట్ ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తున్న అమ్మడుకి పావ్ భాజీ అంటే చాలా ఇష్టమట. అంతా ఇంతా ఇష్టం కాదండోయ్..సినిమా షూటింగ్ కు టై అయిపోతున్నా కానీ రోడ్డు పక్కన పావ్ భాజీ బండి కనిపిస్తే చాలు..టెంప్ట్ అయిపోతుందట.

మరీ ముఖ్యంగా రోడ్డు మీద దొరికే పావ్ భాజీ అంటే చాలా చాలా ఇష్టమట. పావ్ భాజీ కనిపిస్తే తనను తాను కంట్రోల్ చేసుకోలేదట. డైట్ లో ఉన్నా కానీ కొనుక్కుని హాట్ హాట్ గా లాగించేస్తుందట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు భిన్న విభిన్న కామెంట్స్ పెడుతున్నారు. ఒకరు మాకు పావ్ భాజీ అంటే ఇష్టం అంటుంటే మరొకరు..ఇంత స్టార్ హీరోయిన్ రొడ్డు పక్కన పావ్ భాజీ ని లైక్ చేయడం వెర్రీ ఇంట్రెస్టింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news