Moviesకీర్తి సురేష్ పై మోజు పడ్డ సీఎం కొడుకు..నచ్చకపోయినా తప్పక ఒప్పుకుందట..?

కీర్తి సురేష్ పై మోజు పడ్డ సీఎం కొడుకు..నచ్చకపోయినా తప్పక ఒప్పుకుందట..?

కీర్తి సురేష్‌.. ఈ పేరు కన్నా కూడా ఆమెకి మహానటి అనే పేరు అయితే కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక చాలా మంది ఆమె అభిమానులు కూడా అలాగే అంటారు కూడా. ఇక ఈమెను మహానటి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ పాత్రలోనైన ఇట్టే ఇమిడిపోయి చేసే హీరోయిన్స్ కొందరే ఉంటారు. అలాంటి వారిలో కీర్తి కూడా ఒకరు. కీర్తి సురేష్ నటించిన మహానటి సినిమా విడుదలైయే వరకు ఆమె ఒక్క హీరోయిన్ గానే తెలుసు కానీ, ఆ సినిమా తరువాత ఆమె మహానటి సావిత్రి నే అయిపోయింది. అంతలా మనల్ని తన నటన తో ఆకట్టుకుంది ఈ కీర్తి సురేష్. ‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్‌ సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ఇక ఈ సినిమాతోనే ఆమెకు ఉత్తమ జాతీయ నటిగా పురస్కారం లభించింది.

ముఖ్యంగా కీర్తిని జనాలి ఇష్టపడటానికి కారణం ఏమిటంటే..ఆమె రూల్స్ ని బ్రేక్ చేయదు. ఆమెకంటూ నటన పరంగా డ్రెస్సింగ్ పరంగా కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. ఇక అవి ఎట్టి పరిస్ధితిలోను దాటరు. ఇక రొమాన్స్ పరంగా కూడా అంతే. హద్దులు దాటి చెయద్దు. ఒక్కవేళ ఆమె రొమాంటిక్ సీన్స్ చేసినకూడా ఆమె హద్దులు దాటి చేయదట. ఎక్కడ ఎంత అవసరమో అంతే చేస్తుందట. ఇక ఇలా తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్న కీర్తీ సురేష్ ఫస్ట్ టైం ఓ సీఎం కొడుకు కోసం తన రూల్స్ ని బ్రేక్ చేసిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పలు బడా ప్రాజెక్ట్స్ కి సైన్ చేసి బిజీ బిజీ గా ఉన్న కీర్తీ మరో సినిమాకి సైన్ చేసిన్నట్లు తెలుస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, హీరో ఉదయనిధి స్టాలిన్ తదుపరి చిత్రం మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రాబోతున్నట్లు కొన్నిరోజులుగా టాక్ వినిపిస్తుంది.

 

ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంతో మంది సెలక్ట్ చేసినా..హీరో ఉదయనిధి స్టాలిన్ మాత్రం కీర్తి సురేష్ అయితేనే ఈ పాత్రకు బాగుంటుందని మరీ మరీ చెప్పి డైరెక్టర్ ను ఒప్పించి ..ఫైనల్ గా ఆమెను కలిసి కధ చెప్పారట. సినిమా స్టోరీ లైన్ కు ఇంప్రెస్ అవ్వని కీర్తీ చాలా రోజులు ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టిందట. ఇక ఫైనల్ గా హీరో సైడ్ నుండి ప్రేజర్ పెరిగిపోవడంతో ..స్టోరీ నచ్చకపోయినా కూఉడా తప్పనిసరి పరిస్ధితుల్లో తప్పక ఓకే చేసిందట. ప్రతుతం ఈ వార్త కోళీవుడ్ మీడియాలో పాటు టాలీవుడ్ సర్కిల్స్ లోను వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news