Moviesఆ జబర్దస్త్ కమెడియన్ బిగ్ బాస్-6 లో ఉంటే..నేను హోస్ట్ గా...

ఆ జబర్దస్త్ కమెడియన్ బిగ్ బాస్-6 లో ఉంటే..నేను హోస్ట్ గా చేయను.. నాగార్జున సంచలన వ్యాఖ్యలు..?

బిగ్ బాస్ షో.. తెలుగునాట ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ షో స్టార్ట్ అవుతుంది అని తెలిసినప్పటి నుండే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన న్యూస్ లు అన్ని వైరల్ గా మారుతుంటాయి. బిగ్ బాస్ షో అంటే ఇష్టపడే వారు ఎంత మంది ఉన్నారో అంతకన్నా తిట్టుకునేవారు కూడా చాలా మందే ఉన్నారు. హౌస్ లోకి వెళ్లేంత వరకు ఒకలా..లోపలికి వెళ్ళాక మరోకలా చూయిస్తుంటారు అనే పేరు ఉంది. 24 గంటలు జరిగేదాని షూట్ చేసి కేవలం గంట సేపు మాత్రమే ప్రసారం చేసి కొందరి లీఫ్ లను నాశనం చేసింది బిగ్ బాస్. ఇది మేము చెబుతున్నది కాదు. స్వయంగా బిగ్ బాస్ లో పాల్గోన్న కంటెస్టెంట్లే చెప్పుతున్నారు. హౌస్ లో జరిగేది ఒకటి మీకు చూయించేది మరోకతి అంటూ బయటకు వచ్చిన కంటెస్టెంట్లు చెప్తూనే ఉన్నారు.

ఇక ఈ సారి ఇలాంటి గొల లేకుండా ఏక్మగా 24*7 ఆ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో మనమే చూసే విధంగా బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం కానుంది. 24*7 అంటే 24 గంటలూ ఏకదాటిగా ఈ షోని హాట్ స్టార్‌లో లైవ్ ప్రసారం చేయనున్నట్టు ఇప్పటికే టీం తెలిపారు.ఇక బిగ్ బాస్ సీజన్ 6కి తానే హోస్ట్ అని చెప్పిన నాగార్జున.. ఈ ఓటీటీ బిగ్ బాస్‌కి ఎవరు హోస్ట్ అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక శని, ఆదివారాలే కాబట్టి.. ఆయనే హోస్ట్ చేస్తారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నాగార్జున బిగ్ బాస్ టీంకి ఓ కండీషన్ పెట్టిన్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే బిగ్ బాస్ ఓటీటీ కోసం కంటెస్టెంట్లను సెలక్ట్ చేసారంటూ వార్తలు వినిపిస్తుండగా..వారిలో జబర్ధస్త్ కు సంబంధించిన ఓ కమెడియన్ పేరు కూడా వినిపించింది. అయితే , సదరు కమెడియన్ బిగ్ బాస్ 6 లో ఉంటే తాను హోస్ట్ గా చేయనని చెప్పారట నాగార్జున. అందుకు కారణం ఏమిటంటే.. నాగారజున కు సంబంధించిన పరసనల్ లిఫ్ ను ఆయన స్కిట్ల రూపంలో వేస్తూ నాగ్ ను అవమానించాడట..అంతేకాదు రీసెంట్ గా చైతూ సమంత విడాకుల మ్యాటర్ ని కూడా స్కిట్ ల రూపంలో ఎద్దేవా చేస్తూ అక్కినేని కుటుంబాని కించపరిచారట. అందుకే నాగార్జున ఆ కమెడియన్ ఉంటే హోస్టింగ్ నుండి తప్పుకుంటా అన్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింత హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news