Moviesహీరో రామ్ బాల నటుడిగా చేసిన సినిమా ఏంటో తెలుసా..?

హీరో రామ్ బాల నటుడిగా చేసిన సినిమా ఏంటో తెలుసా..?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ బ్యాగ్రౌండ్‌ ఉన్నప్పటికీ ఎంతో కష్టపడుతూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకునన హీరో రామ్ పోతినేని. క్లాస్‌, మాస్‌ అనే తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఎనర్జిటిక్‌ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు. యాక్టింగ్‌తో పాటు స్టయిల్‌ను, ఎనర్జీని జోడించి వెండితెరపై కిర్రాక్‌ పుట్టించే యంగ్‌ హీరోల్లో రామ్‌ఒకరు. 2006లో వైవీఎస్ చౌదరి రూపొందించిన ‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరకి హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే అప్పటికి రామ్ వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే.

స్రవంతి రవి కిషోర్ తమ్ముడి కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ లో పడుతూ లేస్తూ హీరోగా నిలదొక్కుకున్నాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. ఆ సినిమా తర్వాత నిన్నమొన్నటి రెడ్ మూవీ వరకు రామ్ కెరీర్ లో ప్లాప్ లు ఉన్నాయి.. హిట్స్ ఉన్నాయి. బ్లాక్ బస్టర్లు కూడా ఉన్నాయి. రెడీ, నేను శైలజ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ తో లవర్ బాయ్ లా పేరు తెచ్చుకున్న రామ్.. ఇస్మార్ట్ శంకర్ తో మాస్ అవతారమెత్తాడు. ఇస్మార్ట్ హిట్ తో మాస్ ఫాన్స్ మనసులు దోచేశాడు.

అయితే ఎప్పుడూ అవే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్లు చేస్తున్నాడు అనే విమర్శలు కూడా రామ్ కు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ కొట్టింది. తెలంగాణ మాస్ కుర్రాడిగా రామ్ నటన అద్భుతం అనే చెప్పాలి. ఈ చిత్రం కోసం తన లుక్ ను కంప్లీట్ గా మార్చేశాడు రామ్. 6 ప్యాక్ బాడీని కూడా బిల్డ్ చేసాడు.

అయితే రామ్ బాల నటుడిగా కూడా చేశాడు అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. రామ్ ఓ ‘అదయాలమ్’ అనే తమిళ షార్ట్ ఫిల్మ్ లో నటించాడు. అపుడు రామ్ వయసు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. ఓ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ఈ షార్ట్ ఫిల్మ్ లో రామ్ నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా లభించింది. ఈ విషయాన్ని రామ్ ఓ పర్సనల్ ఇంటర్వ్యూలో చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news