Moviesఇది కదా అసలైన పండగంటే..బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే..!!

ఇది కదా అసలైన పండగంటే..బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’ 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యిన ఈ మూవీ ఎంటటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని చోట్లా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఎన్నో కొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా బన్నీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ బనీ కలిసి సినిమా చేస్తే రికార్డ్ బద్దలు అవ్వడం పక్కా అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ సినిమా.

ఈ సినిమా కి మయిన్ ప్లస్ పాయింట్ మ్యూజిక్. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం అదనపు బలంగా మారడంతో ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలుకొట్టీంది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా రిలీజ్ అయ్యి రెండు సంవత్స్రాలు కావస్తున్న ఇప్పటికి ఈ సినిమా పాటలు ప్రతి ఫంక్షన్ లో ప్లే చేస్తూనే ఉంటారు. ఒక్కప్పుడు అమ్మయిని చూస్తే కుందనపు బొమ్మలా ఉన్నావ్ అంటారు. కానీ ఇప్పుడు ఏ అమ్మాయిని చూసిన బుట్ట బొమ్మ బుట్టబొమ్మ అంటూ పాటలు పాడేస్తున్నారు. అంత బాగా జనాలకు రీచ్ అయ్యింది ఈ సినిమా.

ఇక ఈ సినిమా బాలీవుడ్ బదా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల దృష్టిని సైతం ఆక‌ర్షించింది. ఈ మూవీ అక్క‌డ షెహ‌జాదాగా రీమేక్ చేస్తున్నారు. బ‌న్నీ, పూజా హెగ్డే పాత్ర‌ల్లో కార్తీక్ ఆర్య‌న్‌, కృతి సనన్ క‌నిపించ‌నున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో టబు పాత్రలో బాలీవుడ్‌ నటి మనీషా కొయిరాల నటిస్తోంది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ అల వైకుంఠ‌పుర‌ములో హిందీ డ‌బ్బింగ్ వ‌ర్ష‌న్‌ జ‌న‌వ‌రి 26న థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. తెలుగులో కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా బాలీవుడ్ లో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే..!!

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news