Moviesతార‌క్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టం ఎందుకు...!

తార‌క్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టం ఎందుకు…!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి త్రిబుల్ ఆర్ సినిమా మీదే ఉంది. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా ? అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అభిమానులు అందరూ ఇప్పుడు జనవరి 7వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య రు. 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి కానుకగా త్రిబుల్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల్లో రిలీజ్ అవుతోంది. దర్శకుడు రాజమౌళి తో పాటు ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇప్పటికే సౌత్ నుంచి నార్త్ వరకు ప్రమోషన్లు హోరెత్తిస్తున్నారు.

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సైతం త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యాక మరో నాలుగు నెలల పాటు ఏ సినిమా రిలీజ్ చేయవద్దని చెప్పారంటే… ఈ సినిమాపై బాలీవుడ్ వర్గాల్లో కూడా ఎలాంటి భారీ అంచనాలు ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పటికే ముంబై – చెన్నైలో నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ల‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక నార్త్ లో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక హోస్ట్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి మీరు నటించిన సినిమాల్లో ఏ సినిమాను ? బాలీవుడ్ లో రీమేక్ చేస్తారు అని ప్రశ్నించాడు.

వెంటనే ఎన్టీఆర్ జై లవకుశ సినిమా అని ఆన్స‌ర్ ఇచ్చాడు. 2017 లో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. జై ల‌వ‌కుశ‌ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించగా బాబి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ జై – లవ – కుశ‌గా మూడు పాత్రల్లో కనిపించాడు. బాలీవుడ్లో నటిస్తే కచ్చితంగా ఈ సినిమాను రీమేక్ చేయాలని అనుకుంటున్నట్లు ఎన్టీఆర్ చెప్పాడు.

వాస్తవంగా చెప్పాలంటే జై లవకుశ కంటే ఎన్టీఆర్ కెరీర్లో ఇంకా మంచి సినిమాలు ఉన్నా… ఈ సినిమాలో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ చాలా వైవిధ్యంగా కనిపించడంతో పాటు… జై పాత్ర అదిరిపోయింది. న‌ట‌కు మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. అందుకే ఎన్టీఆర్ బాలీవుడ్‌లో రీమేక్ చేస్తే ఈ సినిమానే చేస్తాన‌ని చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news