Moviesస్టేజ్‌పైనే ముద్దులు.. బోల్డ్ బ్యూటీతో డేటింగ్‌కు రెడీ అన్న నాగార్జున...!

స్టేజ్‌పైనే ముద్దులు.. బోల్డ్ బ్యూటీతో డేటింగ్‌కు రెడీ అన్న నాగార్జున…!

తెలుగు బిగ్‌బాస్ సీజన్ 5 ముగిసింది. 104 రోజుల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సీజన్లో సన్నీ విజయం సాధించారు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేను ఎవరూ ఊహించని విధంగా అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేశారు. టాలీవుడ్, బాలీవుడ్‌కి చెందిన అతిరథ మహారథులు అందరూ బిగ్ బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. నాని శ్యాం సింగరాయ టీంతో పాటు దర్శకుడు రాజమౌళి, బ్రహ్మాస్త్ర దర్శకుడు ఆయాన్‌ ముఖర్జీ, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, ఆలియాభట్ ఫైనల్ ప్రోగ్రాం లో కనువిందు చేశారు.

బిగ్‌బాస్ సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలే సక్సెస్ చేయటంలో మంచి ప్లానింగ్ చేశారని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే బిగ్‌బాస్ హౌస్ నుంచి మొదటి వారం ఎలిమినేట్ అయిన బోల్డ్ బ్యూటీ స‌ర‌యు నాగార్జునను డేట్ కి వెళ్దాం అని చెప్పటం చాలా హాట్ టాపిక్‌గా మారింది. మీరంటే నాకు చాలా ఇష్టం… నాతో డేట్ కి వస్తారా అని అడగగా… ఓకే చెప్పిన నాగార్జున బిగ్‌భాస్ గ్రాండ్ ఫినాలే అయిన వెంట‌నే డేట్‌కు వెళ‌దాం అని చెప్పాడు.

సరయు ఆనందంగా ముద్దులు పెడుతూ గంతులేసింది. ఇక స‌ర‌యు యూట్యూబ్‌లో యూత్‌ను ఆక‌ట్టుకునేలా బూతుల‌తో ఎంత ఫేమ‌స్ అయ్యిందో ప్ర‌త్యేకంగా చెప్పక్క‌ర్లేదు. ఆమె వాడే బాష‌తో పాటు ఆమె వేష‌ధార‌ణే ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింద‌ని చెప్పాలి. ఇర 7 ఆర్ట్స్ పేరుతో ఆమె తీసిన షార్ట్ ఫిలింస్ కూడా బాగా ఫేమ‌స్ అయ్యాయి.

ఈ క్రేజ్‌తోనే ఆమె బిగ్‌బాస్ 5లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆమె బిహేవియ‌ర్ న‌చ్చ‌క పోవ‌డంతో జ‌నాలు ఆమె త‌క్కువ ఓట్లు వేయ‌డంతో ఆమె ఫ‌స్ట్ వీక్‌లోనే ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఎలిమినేట్ అయ్యాక ఇప్పుడు ఏకంగా నాగార్జున‌తోనే డేట్ చేయాల‌ని ఉంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news