Moviesవారెవ్వా..అదరగొట్టేసిన ‘పుష్ప’ ..ఇలాంటివి బన్నీకే సాధ్యం..!!

వారెవ్వా..అదరగొట్టేసిన ‘పుష్ప’ ..ఇలాంటివి బన్నీకే సాధ్యం..!!

అల్లు అర్జున్-సుకుమార్ క్రేజీ కాంబోలో రాబోతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప’. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం. ఈ సినిమా మొత్తం రెండు భాగాలు. కాగా, మొదటి భాగాన్ని ఈరోజు గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన అప్ డేట్స్ అన్నిటికీ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. దానికి తగ్గటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

పుష్ప సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3 వేల థియేటర్లలో విడుదల చేసారు. ఇక విడుదలకు ముందే పుష్ప సినిమాసంచలనం సృష్టించింది. పుషప బుక్ మై షోలో పుష్ప సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు ఇప్పటి వరకు 8 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఇది ఒక సరికొత్త రికార్డు.

ఈమధ్య కాలంలో ఏ ఒక్క సినిమా కూడా దక్కించుకోని భారీ ఓపెనింగ్స్ ను పుష్ప సినిమా దక్కించుకుంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలోనే మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఏకంగా అయిదు కోట్ల రూపాయలు వచ్చినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్‌ రికార్డు గా పుష్ప నిలిచిందట.. ముందు ముందు మరెన్ని రికార్డులు ఈ సినిమా నమోదు చేయబోతుందో అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పుష్ప సినిమా బన్నీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా నిలిచిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news