Moviesవిజయ్ సేతుపతిని తన్నింది అందుకే..అసలు మ్యాటర్ ఇదే..?

విజయ్ సేతుపతిని తన్నింది అందుకే..అసలు మ్యాటర్ ఇదే..?

విజయ్ సేతుపతి .. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. తమిళ స్టార్ అయినటువంటి ఈయన.. హీరోగా కంటే విలన్ గానే బాగా మెప్పిస్తున్న విషయం తెలిసిందే. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి ప్ర‌స్తుతం కోలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోను డిఫ‌రెంట్ రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంటున్నాడు. విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు అన్నట్లుగా తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు. ఉప్పెన సినిమాతో తెలుగు హీరోలను బాగా ఆకట్టుకున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్. ప్రస్తుతం విజయ్ సేతుపతి సినిమా లో ఉండే విధంగా కొందరు హీరోలు, నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారట.

అయితే ఇవాళ ఎయిర్ పోర్ట్ లో హీరో విజయ్ సేతుపతికి ఊహించని ఘటన ఎదురైంది. బెంగళూరు ఎయిర్ పోర్టులో ఊహించని పరిణామంతో అక్కడున్న వారిని భయబ్రాంతులకు గురిచేసింది. ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి నడుస్తూ వెళ్తన్నాడు. అంతలోనే గుర్తు తెలియని వ్యక్తి ఆయన పై దాడికి దిగాడు. వెనుకనుంచి వచ్చి ఒక్కసారిగా కాలితో తన్నాడు. దీంతో విజయ్ సేతుపతికి ఏం జరిగిందో అర్థం కాలేదు. దీంతో.. ఒక్కసారిగా అదిరిపడ్డాడు విజయ్ సేతుపతి. చుట్టుపక్కన ఉన్నవాళ్లు.. సెక్యూరిటీ, పోలీసులు.. వెంటనే ఆ దుండగున్ని పట్టుకున్నారు.

 

అయితే ఈ గటనకు సంభంధి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 6 సెకన్ల వీడియోలో ఇంతవరకే ఉంది. విజయ్ సేతుపతిని అతడు ఎందుకు వెనుక నుంచి తన్నాడు అనేది తెలియాల్సి ఉంది.అయితే మరో వైపు ఆ అగంతకుడు విజయ్ ని తన్నింది..పునిత్ కోసమే అని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. పునీత్ రాజ్ కుమార్ మరణం విషయంలో కోలీవుడ్ సరిగా స్పందించలేదని.. ఆయనకు నివాళులర్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే టాక్ కూడా వినిపిస్తోంది. అందుకే ఆ కోపాని ఇలా త్మిళ హీరో మీద చూపించిన్నత్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఇక ఈ గటన ప విజయ్ అభిమానులు కోపంగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news