MoviesOfficial: సుమ సినిమా పోస్టర్‌ వచ్చేసిందోచ్..ఆ బ్యానర్ లోనే..!!

Official: సుమ సినిమా పోస్టర్‌ వచ్చేసిందోచ్..ఆ బ్యానర్ లోనే..!!

యాంకర్ సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులుండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో ఐనా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింప చేస్తూ ఆకట్టకుంటోంది. జన్మత: మలయాళీ అయినా తెలుగింటి కోడలై.. మాటలతో మైమరిపిస్తోంది సుమ. తెలుగు యాంకర్స్ లలో స్టార్ సినిమా నుండి చిన్న సినిమా వరకు ఈవెంట్ ఏదైనా సినిమా ఫంక్షన్ అనగానే అందరికి గుర్తొచ్చే యాంకర్ సుమ. ఎన్నో ఏళ్లుగా ఎవరెవరో వస్తున్నా పోతున్నా సుమ మాత్రం యాంకరింగ్ చేస్తూనే ఉంది.. ఉంటుంది.

ఇప్పుటికే బుల్లితెర‌పై ఏ ప్రోగ్రామ్ వ‌చ్చినా అన్నింట్లోనూ క‌నిపించే సుమ‌కు ఇక్క‌డ ఎంత డిమాండ్ క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్క‌డ న‌వ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లోనూ ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంది. అయితే తాజాగా ఆమె సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుందనే వార్త గత కొద్ది రోజుల నుండి హచ్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీని పై సుమా కూడా తన ఇన్స్ స్టా గ్రాం లో ఓ వీడియో కూడా వదిలింది. చాలా మంది సెలబ్రిటీలు తన గురించి మాట్లాడిన వీడియో క్లిప్స్ కట్ చేసి ఓ వీడియో రెడీ చేసి.. ”ఇంతమంది అడుగుతున్నారంటే చేసేస్తే పోలే” అని సుమ పోస్ట్ చేసారు.

అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన సినిమా పోస్టర్‌ పోస్ట్ చేస్తూ..అందరికి షాకిచ్చింది. వెన్నెల క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నట్లు అదికారిక ప్రకటన చేసింది. టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌ నవంబర్‌ ఆరున రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపింది. ఎమ్‌ఎమ్‌ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ పోస్టర్‌లో బియ్యం దంచడానికి సుమ సిద్ధమైనట్లు చూపించారు. కా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియలాంటే ఇంకో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే..!!

 

 

View this post on Instagram

 

A post shared by Suma K (@kanakalasuma)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news