Moviesమొత్తానికి సమంత పొగరు దించిన బాలయ్య..?

మొత్తానికి సమంత పొగరు దించిన బాలయ్య..?

నందమూరి నట సింహం బాలకృష్ణ ఎవ్వరు ఊహించని విధంగా హోస్ట్ గా తెర పై కనిపించడానికి సిద్ద పడిన విషయం తెలిసిందే. ఆహాలో నందమూరి బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్’ పేరుతో ఓ క్రేజీ టాక్ షో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ షో కి సంబంధించి రెండు ఎపిసోడ్లు స్ట్రీమింగ్ అవ్వగా..రెండూ ఎపిసోడ్స్ అభిమానులను బాగా అలరించాయి. ఇంకా చెప్పాలి అంటే ఫుల్ నాన్ స్టాప్ గా నవ్వులు పూయిస్తుంది ఈ షో అనే చెప్పాలి. తెర పై ఎన్నో రకాల క్యారెక్టర్స్ వేసి అభిమానుల దగ్గర శభాష్ అనిపించుకున్న బాలయ్య..హోస్ట్ గా కూడా తనకు పోటీ ఎవరు లేరంటూ మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

బాలయ్య బాబు హోస్టింగ్ అదిరిపోవడంతో అహా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ షోలో బాలయ్య వచ్చే గెస్ట్ లను ఇంటర్వ్యు చేసే విధానం చాలా మందికి నచ్చింది. ‘అన్ స్టాపబుల్’ షో కి ఫస్ట్ గెస్ట్ గా వచ్చిన మోహన్ బాబు ని ఆయన అడిగిన కొన్ని ప్రశ్నలు.. ఇప్పటివరకు మిస్టరీగా ఉన్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లైంది. ఇలా బాలయ్య పలు ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు గురించి కూడా చర్చించడం తో ఈ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక రెండో ఎపిసోడ్ కి గెస్ట్ గా వచ్చిన నాని తో బాలయ్య బాబు ఓ ఆట ఆడేసుకున్నారు. పవర్ ఫుల్ పంచ్ లు, ఫన్నీగా నాని జోక్ లతో ఈ ఎపిసోడ్ నవ్వులు పూయించింది.

ఈ రెండు ఎపిసోడ్స్ చూసిన అభిమానులకు ఈ షో పై అంచనాలు భారీగా పెరిగిపోయిన్నట్లు తెలుస్తుంది. దీంతో ఓటీటీకి సబ్స్క్రిప్షన్ లు కూడా బాగా పెరిగిపోతున్నాయని సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కాగా.. బాలయ్య కంటే ముందే ఆహా ఓటీటీ బృందం వారు ఎన్నో రకాల షో లు నిర్వహించారు. టాప్ హీరోయిన్ గా ఉన్న సమంత తో సామ్ జామ్ అనే టాక్ షో ని కూడా నిర్వహించారు. కానీ సమంత హోస్టింగ్ ఎవ్వరికి నచ్చలేదు. దీంతో షో అట్టర్ ఫ్లాప్ అయ్యిందనే టాక్ ను దక్కించుకుంది. సబ్స్క్రిప్షన్ లు కూడా ఎక్కువ రాలేదు. ఈ రకంగా చూస్తే సమంత తో కంపేర్ చేసుకుంటే బాలయ్య నే ఆహాకు లక్కి హ్యాండ్ అని అంటున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news