Moviesఇండస్ట్రీని ఏలుతున్న ఆ హీరోయిన్ చెత్త బుట్టలో దొరికిందనే విషయం మీకు...

ఇండస్ట్రీని ఏలుతున్న ఆ హీరోయిన్ చెత్త బుట్టలో దొరికిందనే విషయం మీకు తెలుసా..?

మన పెద్ద వాళ్లు అంటుంటారు గా ఆడ‌పిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అని. కానీ కొందరు త‌ల్లిదండ్రులు మాత్రం ఆడపిల్ల పుట్టిందంటే అప‌శ‌కునంగా భావిస్తుంటారు. అప్పుడే పుట్టిన ఆడ‌పిల్ల‌ని తీసుకెళ్లి చెత్త‌కుప్ప‌ల్లో ప‌డేస్తారు..లేదంటే చంపేస్తారు..ఇలాంటివి ఇప్పటికి తరచూ మనం వార్తల్లో వింటూనే ఉంటాం. అబ్బాయిలకు మేము ఏమాత్రం తీసిపోం అని అన్ని రంగాల్లో పురుషులకు సమానంగా నేటి తరం మహిళలు పని చేసి సత్తా చాటుతున్నా .. కొందరు మానవ మృగాల్లో ఇంకా మార్పు రాకపోవడం దురదృష్టకరం. నేటి ఆడ‌పిల్లే రేప‌టి త‌రాలకు బంగారు భ‌విత అనే సంగ‌తి మనలో చాలా మంది మ‌ర‌చిపోతున్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

అమ్మాయి అంటే చిన్న చూపు చూసే ఈ సమాజంలో అమ్మాయి పుట్టిందని తల్లిని హింసించే అత్తగారు ఈ సోసైటీలో ఇంకా ఉన్నారు అన్న విషయం మనకు తెలిసిందే.కానీ సామాన్యులే కాదు సెలబ్రిటీల జీవితాల్లోను ఇలాంటి విషాద సంఘటనలు జరిగాయని..జరుగుతున్నాయని చాలా తక్కువ మందికే తెలుసు. దానికి బెస్ట్ ఉదాహరణ..ఇప్పుడు మీరు చదివే వార్తే. రోజు మనం టీవీలో..తెర పైన చూసే ఓ హీరోయిన్ ఆడపిల్ల అనే పేరుతో ఎన్నో బాధలు అనుభవించింది. ఆడపిల్ల పుట్టిందని చిన్నప్పుడే తల్లిదండ్రులు చెత్తబుట్టలో వదిలేసి వెళ్ళారు.

రోడు పై వెళుతున్న ఓ మహానుభావుడు ..చిన్న పాప ఏడుపు విని.. పక్కకు వెళ్ళి చూస్తే ఓ పసికందు..చెత్తకుప్పలో ఏడుస్తుంది. ఆకలికి గుక్కపట్టి ఏడ్చేస్తుంది. చలించిపోయినా ఆ వ్యక్తి ఆ బిడ్డను తన ఇంటికే తీసుకెళ్ళి ఆమెను తన కూతురుగానే పెంచుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమె పెద్ద హీరోయిన్. స్టార్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ..కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ..కేవలం సీనియర్ హీరోలు సరసన నటించడమే కాకుండా ప్రస్తుతం వస్తున్న యంగ్ హీరోల సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ చిత్రాలలో కూడా నటిస్తూ తనదైన శైలిలో సినిమాలు చేస్తూ..సినీ సినీ ఇండస్ట్రీలో ఓ రేంజ్ దూసుకుపోతున్నారు. అంతేకాదు ఓ స్టార్ హీరోని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news