MoviesR R R లో 15 నిమిషాల న‌ట‌న‌కు ఆలియా భ‌ట్...

R R R లో 15 నిమిషాల న‌ట‌న‌కు ఆలియా భ‌ట్ అన్ని కోట్ల రెమ్యున‌రేష‌నా ..?

టాలీవుడ్లోనే కాదు.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సినీ అభిమానులు ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? అని రెండున్న‌ర సంవ‌త్స‌రాలుగా ఎదురు చూస్తోన్న వీరి ఉత్కంఠ‌కు ఎట్ట‌కేల‌కు జ‌న‌వ‌రి 7వ తేదీతో తెర‌ప‌డ‌నుంది. సంక్రాంతి కానుక‌గా ఆర్ ఆర్ థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. ఇండియాలో మాత్ర‌మే కాదు.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా చాలా దేశాల్లో భారీ ఎత్తున ఆర్ ఆర్ ఆర్‌ను రిలీజ్ చేస్తున్నారు.

ఇక టాలీవుడ్ లో ఇద్ద‌రు స్టార్ హీరోలుగా ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో పాటు బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోండ‌డంతో సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను ఆకాశంలోకి తీసుకువెళ్లాయి. ఈ సినిమాలో చ‌ర‌ణ్‌కు జోడీగా ఆలియాభ‌ట్ న‌టిస్తోంది.

కేవ‌లం 15 నిమిషాల పాటు మాత్ర‌మే ఆమె పాత్ర ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇందుకోస‌మే ఆలియా భ‌ట్ ఏకంగా రు. 5 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంద‌ని ఈ సినిమా వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకోసం ఆమె ప‌ది రోజుల పాటు షూటింగ్ చేసింద‌ట‌. అంటే ఆమె రోజుకు రు. 50 ల‌క్ష‌లు తీసుకున్న‌ట్టు అయ్యింది. ఇది చాలా ఎక్కువ రెమ్యున‌రేష‌నే అని చెప్పాలి.

నిర్మాత‌లు భేర‌సారాలు ఆడినా ఆమె ఒప్పుకోక‌పోవ‌డంతో చివ‌ర‌కు చేసేదేం లేక ఆమె అడిగినంత ఇచ్చార‌ట‌. ఆమె ఉంటేనే బాలీవుడ్‌లో సినిమాకు మార్కెట్ ఉంటుంద‌ని రాజ‌మౌళి ప‌ట్టుబ‌ట్టి మ‌రీ ఆమెను తీసుకున్నాడు. తాను ముందే చెప్పిన‌ట్టు ప‌ది రోజుల‌కు మించి ఒక్క కాల్షీట్ కూడా ఇవ్వ‌న‌ని చెప్పేసింద‌ట‌. దీంతో రాజ‌మౌళి ముందుగా ఆమె పాత్ర‌కు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశార‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news