Moviesషాకింగ్ న్యూస్‌: హీరోయిన్‌గా పూరి కూతురు..!

షాకింగ్ న్యూస్‌: హీరోయిన్‌గా పూరి కూతురు..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ ఏ సినిమా అయినా చ‌క‌చ‌కా చేసుకుంటూ వెళ్లిపోతుంటారు. పూరి ఒక సినిమా తీయాలంటే బ్యాంకాంగ్ వెళ్లి నాలుగు రోజుల్లో క‌థ రాసుకుని వ‌చ్చేస్తారు. రెండు నెలల్లో సినిమా తీసేసి చ‌క‌చ‌కా రిలీజ్ చేసేస్తారు. ఆ వెంట‌నే పూరి మ‌రో సినిమాకు వెళ్లిపోతారు. ప్ర‌స్తుతం పూరి విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో లైగ‌ర్ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

ఇక ఇప్ప‌టికే పూరి త‌న‌యుడు ఆకాష్‌ను హీరోగా చేశారు. మెహ‌బూబా సినిమా ప్లాప్ అయ్యింది. ఇటీవ‌ల వ‌చ్చిన రొమాంటిక్ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా క‌మ‌ర్షియ‌ల్‌గా హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు పూరి కుమార్తె కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌నుందా ? అంటు అవున‌న్న వార్త‌లే ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.

పూరి కూతురు ప‌విత్ర బుజ్జిగాడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా క‌నిపించింది. ఆ త‌ర్వాత ఆమె తెర‌పై క‌న‌ప‌డలేదు. అయితే ఇప్పుడు ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవ‌కాశాలున్నాయంటూ ఓ వార్త అయితే ఇండ‌స్ట్రీలో షికారు చేస్తోంది. సోష‌ల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తోన్న ఫొటోలు కూడా ఇందుకే సంకేతాలు ఇస్తున్నాయ‌ని అంటున్నారు. ప‌విత్ర లుక్స్ చూస్తుంటే హీరోయిన్ల‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది.

మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక హీరోయిన్‌గా నాలుగు సినిమాలు చేసింది. మ‌రి ప‌విత్ర కూడా హీరోయిన్ అయితే ఏ త‌ర‌హా సినిమాలు చేస్తుంది అనేది చూడాలి. ఇటీవ‌ల పూరి కూడా పిల్ల‌ల ఇష్టానికి ఎప్పుడూ తాను అభ్యంత‌రం చెప్ప‌న‌ని చెప్పారు. హీరోయిన్ కావాల‌నుకుంటే అది ప‌విత్ర‌కు పెద్ద టాస్కే కాదు. అయితే ఇప్పుడు నిర్ణ‌యం అనేది ఆమె చేతుల్లోనే ఉంటుంది. అయితే పూరి మాత్రం ఆమెను త‌మ బ్యాన‌ర్లో తీసే సినిమాల నిర్మాణ వ్య‌వ‌హారాల్లో ఉంచాల‌ని చూస్తున్న‌ట్టు భోగ‌ట్టా ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news