Moviesఒకే క‌థ‌తో హిట్ కొట్టిన బాల‌య్య - ఏఎన్నార్‌.. ఆ సినిమాలు...

ఒకే క‌థ‌తో హిట్ కొట్టిన బాల‌య్య – ఏఎన్నార్‌.. ఆ సినిమాలు ఇవే..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ వ‌య‌స్సు ఆరు ప‌దులు దాటేసినా కూడా ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఓ వైపు బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తోన్న బాల‌య్య , మ‌రో వైపు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ షోతో బిజీగా ఉన్నాడు. బాల‌య్య – బోయాపాటిది బ్లాక్ బ‌స్ట‌ర్ కాంబినేష‌న్ కావ‌డంతో ఈ సినిమా ఖ‌చ్చితంగా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. మ‌రో వైపు మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య క్రాక్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతీహాస‌న్ హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇదిలా ఉంటే బాల‌య్య‌, దివంగ‌త లెజెండ్రీ నటుడు ఏఎన్నార్ ఇద్ద‌రూ క‌లిసి ఒకే క‌థ‌తో ఉన్న సినిమాల్లో చేసి సూప‌ర్ హిట్ కొట్టారు. ఏఎన్నార్ కెరీర్‌లో తిరుగులేని బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ప్రేమాభిషేకం. దాస‌రి నారాయ‌ణ రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా అప్ప‌ట్లో సంవ‌త్స‌రం ఆడింది. ఈ సినిమాలో హీరో క్యాన్స‌ర్‌తో అయితే త‌న‌కు ఉన్న ఈ స‌మ‌స్య‌ను బ‌య‌ట పెట్ట‌కుండా హీరోయిన్‌కు వేరే పెళ్లి జ‌రిగేలా చేస్తారు. ఈ సినిమా అప్ప‌ట్లో పెద్ద సంచ‌ల‌నం.

ఇక కోదండ రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా వ‌చ్చిన సినిమా బొబ్బిలి సింహం. ఈ సినిమాలో బాల‌య్య ప‌క్క‌న మీనా, రోజా హీరోయిన్లుగా న‌టించారు. విజ‌య‌ల‌క్ష్మి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై టి. త్రివిక్ర‌మ రావు నిర్మిచిన ఈ సినిమాలో కూడా హీరోయిన్ రోజా క్యారెక్ట‌ర్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతుంది. అయితే ఆమె కూడా కావాల‌ని త‌న‌కు బాల‌య్య ఇష్టం లేద‌ని చెపుతూనే .. హీరోకు మ‌రో హీరోయిన్ మీనాతో పెళ్లి జ‌రిగేలా చేస్తుంది.

ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టింది. ఈ రెండు సినిమాలు దాదాపు ఒకే లైన్‌తో ఉంటాయి. అయితే ప్రేమాభిషేకంలో హీరోకు క్యాన్స‌ర్‌.. ఇక్క‌డ హీరోయిన్‌కు క్యాన్స‌ర్‌. అలా రెండు సినిమాలు నాగేశ్వ‌ర‌రావు, బాల‌య్య కెరీర్‌లో మంచి సినిమాలుగా నిలిచిపోయాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news