Moviesకార్తీక‌దీపం రేటింగ్ ఢ‌మాల్‌... ఆ త‌ప్పు వ‌ల్లే క్రేజ్ త‌గ్గుతోందా...!

కార్తీక‌దీపం రేటింగ్ ఢ‌మాల్‌… ఆ త‌ప్పు వ‌ల్లే క్రేజ్ త‌గ్గుతోందా…!

బుల్లితెర‌పై ఎన్నో ప్రోగ్రామ్‌లు వ‌స్తున్నా కూడా అవేవి స్టార్ మా ఛానెల్లో ప్ర‌సారం అవుతోన్న కార్తీక‌దీపం సీరియ‌ల్‌కు ఓ మూల‌కు కూడా రావ‌డం లేదు. ఎన్నో ఎంట‌ర్టైన్‌మెంట్ ఛానెల్స్‌.. ఎన్నెన్నో ప్రోగ్రామ్‌లు ఉన్నా కూడా అవేవి కార్తీక‌దీపం ద‌రిదాపుల‌కు కూడా రావ‌డం లేదు. కార్తీక‌దీపం సీరియ‌ల్ ప్ర‌సార‌మ‌వుతోన్న వేళ యావ‌త్ తెలుగు జ‌నాలు అంద‌రూ కూడా టీవీల‌కు అతుక్కుపోయి మ‌రీ ఆ షోను చూస్తున్నారు. చివ‌ర‌కు ఈ షోలో డాక్ట‌ర్ బాబు, వంట‌ల‌క్క పాత్ర‌లు ఎంత పాపుల‌ర్ అయ్యాయంటే వీటి గురించి చాలా షోల్లో క్యారెక్ట‌ర్లు పెట్ట‌డం.. చివ‌ర‌కు సినిమాల్లో సైతం ప్ర‌స్తావ‌న‌కు రావ‌డం జ‌రుగుతోంది. అంత క్రేజ్ తెచ్చుకుంది .. ఈ కార్తీక దీపం సీరియ‌ల్‌.

బుల్లితెర‌పై సినిమాలు, ఇత‌ర ఎంట‌ర్టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లు, క్రికెట్ మ్యాచ్‌లు ఇలా ఎన్ని వ‌చ్చినా కార్తీక‌దీపం క్రేజ్ ముందు అవేవి నిల‌బ‌డేవి కావు. అయితే రాను రాను ఈ షోకు టీఆర్పీ రేటింగ్ త‌గ్గుతూ వ‌స్తోంది. అస‌లు కార్తీక‌దీపం సీరియ‌ల్ అంటే ఇప్ప‌టి వ‌ర‌కు 18 – 21 మ‌ధ్య‌లో టీఆర్పీ వ‌చ్చేది. అయితే ఇప్పుడు ఈ సీరియ‌ల్‌ను మ‌రీ సాగ‌దీస్తూ వ‌స్తున్నారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు సీరియ‌ల్ చాలా బాగుంది.. అన్న ప్రేక్ష‌కులు కూడా ఇప్పుడు పెద‌వి విరుస్తోన్న ప‌రిస్థితి.

ప్ర‌స్తుతం కార్తీక‌దీపం సీరియ‌ల్‌కు 14 – 15 మ‌ధ్య‌లో టీఆర్పీ వ‌స్తోంది. కార్తీక‌దీపం సీరియ‌ల్ ఇలాగే కొన‌సాగితే టీఆర్పీ మ‌రింత త‌గ్గ‌డంతో ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష లా మారుతుందని.. సీరియ‌ల్ కు ఇప్ప‌టికి అయినా మంచి ఎండింగ్ ఇచ్చి ముగిస్తేనే మంచిద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఈ సీరియ‌ల్ మేక‌ర్స్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారు ? లేదా సీరియ‌ల్‌ను మ‌రింత ర‌క్తిక‌ట్టిస్తారా ? అన్న‌ది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news