Moviesబాల‌య్య అన్‌స్టాప‌బుల్‌.. ఆ ఒక్క‌ ఎపిసోడ్ అన్ని రికార్డులు ప‌గిలిపోతాయ్‌..!

బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌.. ఆ ఒక్క‌ ఎపిసోడ్ అన్ని రికార్డులు ప‌గిలిపోతాయ్‌..!

యువ‌ర‌త్న నందమూరి బాలకృష్ణ తొలిసారి ఓటీటీ వేదిక ఆహాలో ఓ టాక్ షోతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఓటీటీ షోకు అదిరిపోయే సినిమాటిక్ లుక్ తీసుకువ‌చ్చిన స్టార్ హీరోగా బాల‌య్య ఇప్ప‌టికే రికార్డుల‌కు ఎక్కారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్రోమోలు దుమ్ము రేపేస్తున్నాయి. న‌వంబ‌ర్ 4న స్ట్రీమింగ్ కానున్న ఫ‌స్ట్ ఎపిసోడ్ కోసం యావ‌త్ తెలుగు ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు.

అన్‌స్టాప్‌బుల్ షోలో మొత్తం 12 ఎపిసోడ్లు స్ట్రీమింగ్ కానున్నాయి. మంచు ఫ్యామిలీతో బాల‌య్య చేసిన తొలి ఇంట‌ర్వ్యూకు సంబంధించిన తొలి ఎపిసోడ్ ప్రోమోయే దుమ్ము రేపేసింది. తొలి ఎపిసోడ్‌లోనే బాల‌య్య వ‌ర్సెస్ మోహ‌న్‌బాబు మ‌ధ్య కాస్త ఘాటైన మాట‌ల తూటాలు పేలాయ‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ షోకు సంబంధించి ఓ అదిరిపోయే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ షోలో సందడి చేయనున్నారట. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స‌మాచారం అయితే లేదు. కానీ బాబాయ్ – అబ్బాయ్ ఒకే వేదిక పంచుకోవాల‌ని నంద‌మూరి అభిమానులే కాదు.. యావ‌త్ తెలుగు సినిమా అభిమానులు ఎన్నో యేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. మ‌రి వీరిద్ద‌రు క‌లిసి చేస్తే ఆ ఎపిసోడ్ ఖ‌చ్చితంగా బిగ్గెస్ట్ రికార్డులు క్రియేట్ చేసి డిజిట‌ల్ ప్లాట్ ఫాం షోల చ‌రిత్ర‌లోనే స‌రికొత్త హిస్ట‌రీ క్రియేట్ చేస్తుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి.

ఇక బాల‌య్య టాక్ షోలో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్, నేచురల్ స్టార్ నాని, దగ్గుబాటి రానా కూడా పాల్గొంటారని తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news