Moviesబిగ్‌బాస్‌లో 8 వారాలు.. లోబో గ‌ట్టిగానే సంపాదించాడా...!

బిగ్‌బాస్‌లో 8 వారాలు.. లోబో గ‌ట్టిగానే సంపాదించాడా…!

తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ మామ‌లూగా లేదు. తాజాగా జ‌రుగుతోన్న ఐదో సీజ‌న్ విజ‌య‌వంతంగా ఎనిమిదో వారానికి చేరుకుంది. ఎనిమిదో వారం నుంచి లోబో ఎలిమినేట్ అయ్యాడు. వీకెండ్ వ‌చ్చిందంటే చాలు నాగార్జున ఎంట్రీ ఇస్తే బిగ్‌బాస్ రేటింగ్స్ పేలిపోతున్నాయి. పలువురు చిన్న చిన్న సెల‌బ్రిటీలు, బుల్లితెర సెల‌బ్రిటీల‌కు ఈ షో ఓ అవ‌కాశంగా మారింది.

గ‌తంలో బిగ్‌బాస్ షో అంటేనే త‌న‌కు న‌చ్చ‌ద‌ని చెప్పిన లోబో అనూహ్యంగా ఐదో సీజ‌న్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. లోబో ఈ షోలోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌మే పెద్ద షాకింగ్‌. ఇక హౌస్‌లో త‌న వేష‌ధార‌ణ తో పాటు లోప‌ల స‌భ్యులు అంద‌రిని త‌న‌దైన కామెడీతో అల‌రించ‌డంతో పాటు బ‌య‌ట షో చూస్తోన్న ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన లోబో 8 వారాల‌కే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బ‌య‌ట‌కు రావ‌డం చాలా మందిని నిరాశ ప‌రిచింది.

బిగ్‌బాస్‌ నుంచి లోబోకు ఎంత రెమ్యునరేషన్ వచ్చిందన్నది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లోబోకు లోప‌ల ఉన్న‌న్ని రోజులు వారానికి రు. రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్‌గా ఇచ్చార‌ట‌. మొత్తం ఎనిమిది వారాల‌కు గాను రు. 16 ల‌క్షల వ‌ర‌కు లోబో వెన‌కేసుకున్నాడ‌ని తెలుస్తోంది.

అయితే లోప‌ల లోబో చేసిన కామెడీతో మ‌నోడికి ముందుగా అనుకున్న రెమ్యున‌రేష‌న్ కంటే కాస్త ఎక్కువే ముట్ట‌చెప్పార‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news