Moviesలెస్బియ‌న్‌గా న‌టించిన స్టార్ హీరోయిన్స్ ..!

లెస్బియ‌న్‌గా న‌టించిన స్టార్ హీరోయిన్స్ ..!

సినిమాలు అన్నాక ర‌క‌ర‌కాల పాత్ర‌లు వేయాల్సి ఉంటుంది. హీరోయిన్లు ప్రేయసి గాను, భార్య గాను, రెండో భార్య‌గాను ఇలా అనేక ర‌కాల పాత్ర‌లు పోషిస్తూ ఉంటారు. చివ‌ర‌కు వేశ్య పాత్ర కూడా వేయాల్సి ఉంటుంది. అయితే కొంద‌రు హీరోయిన్లు లెస్బియ‌న్ పాత్ర‌లు కూడా వేశారు. హాలీవుడ్ సినిమాల‌లో ఈ లెస్బియ‌న్ పాత్ర‌లు చాలా కామ‌న్‌. అయితే ఇండియ‌న్ సినిమాల్లో మాత్రం లెస్బియ‌న్ పాత్ర‌లు వేయాలంటే హీరోయిన్లు చాలా వ‌ర‌కు ఆలోచిస్తూ ఉంటారు.

అయినా కూడా కొంద‌రు డేర్ చేసి లెస్బియ‌న్ పాత్ర‌ల్లో న‌టించారు. అప్సర రాణి, నైనా గంగూలీ వీరిద్దరూ కలిసి డేంజరస్ సినిమాలో లెస్బియన్ పాత్రలో క‌నిపించారు. ఇక ఏ మాత్రం ఎక్స్‌పోజింగ్‌కు ఇష్ట‌ప‌డ‌ని నిత్యా మీన‌న్ బ్రీత్ వెబ్‌సీరిస్‌లో లెస్బియ‌న్‌గా న‌టించింది. అంతే కాదు ఫ్యామిలీ హీరోయిన్‌గా మంచి మార్కులు ఉన్న అంజ‌లి సైతం లెస్బియ‌న్‌గా న‌టించి అంద‌రికి షాక్ ఇచ్చారు.

అంజ‌లి పావ కదైగల్ అనే సినిమాలో లెస్బీయన్ పాత్రలో నటించారు. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా సైతం లెస్బియ‌న్‌గానే క‌నిపించారు. అ సినిమాలో ఆమె ఈ పాత్ర‌లో క‌నిపించారు. రెజీనా ఏక్ లడకీ కో దేఖా తో ఐసా లగా సినిమాలో, నందితా దాస్ ఫైర్ సినిమాలో లెస్బియ‌న్‌గా న‌టించారు. పాత్ర ఏదైనా ఈ త‌ర‌హా పాత్ర‌ల్లో కూడా న‌టించిన హీరోయిన్ల డేర్‌నెస్‌ను మెచ్చుకోవాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news