Moviesఆ సినిమాలో ప‌వ‌న్ అమ్మే సంప‌త్ భార్య‌... ఆ కార‌ణంతోనే విడాకులా..!

ఆ సినిమాలో ప‌వ‌న్ అమ్మే సంప‌త్ భార్య‌… ఆ కార‌ణంతోనే విడాకులా..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా వ‌చ్చిన కొమ‌రం పులి సినిమా గుర్తుండే ఉంటుంది. ఎస్‌. జె. సూర్య ద‌ర్శ‌క‌త్వంలో 2010లో వ‌చ్చిన ఈ సినిమా డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ సినిమాలో ప‌వ‌న్‌కు త‌ల్లిగా శ‌ర‌ణ్య న‌టించింది. శ‌ర‌ణ్య టాలెంట్ ప‌రంగా ఎవ్వ‌రూ వంక పెట్ట‌లేరు. మ‌ళ‌యాళ ఇండ‌స్ట్రీకి చెందిన ఆమె తండ్రి అక్క‌డ పాపుల‌ర్ డైరెక్ట‌ర్‌. శ‌ర‌ణ్య భ‌ర్త ఎవ‌రో కాదు మ‌నంద‌రికి బాగా తెలిసిన వ్య‌క్తే. తెలుగులో ప‌లు సినిమాల్లో విల‌న్‌గా చేసిన సంప‌త్‌రాజ్‌.

అత్తారింటికి దారేది సినిమాతో పాటు ప్ర‌భాస్ మిర్చి సినిమాలో విల‌న్‌గా న‌టించి త‌న టాలెంట్ ఫ్రూవ్ చేసుకున్నాడు. త‌ర్వాత సంప‌త్ ఎన్నో సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు. ఇక సంప‌త్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో త‌న వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన విష‌యాలు చెప్పారు. అత‌డికి 23 ఏళ్లు ఉన్న‌ప్పుడే శ‌ర‌ణ్య‌తో పెళ్ల‌య్యింద‌ట‌. ఈ దంప‌తుల‌కు ఓ కుమార్తె కూడా పుట్టారు.

త‌ర్వాత ఇద్ద‌రూ త‌మ కెరీర్‌లో బిజీగా ఉండ‌డంతో ప‌రస్ప‌ర అంగీకారంతోనే విడిపోయిన‌ట్టు సంప‌త్ చెప్పాడు. త‌న భార్య నుంచి విడిపోయినా కూడా తాను అప్పుడ‌ప్పుడు ఫోన్ చేసి ఆమె యోగ‌క్షేమాలు క‌నుక్కుంటాన‌న్నాడు. ఇక త‌న కుమార్తె సైతం అప్పుడ‌ప్పుడు త‌న త‌ల్లి ద‌గ్గ‌ర‌కు వెళ్లి వ‌స్తుంటుంద‌ని అన్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news