Moviesచిన్న వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

చిన్న వ‌య‌స్సులో పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సెల‌బ్రిటీలు ఎంత వ‌య‌స్సు వ‌చ్చినా కూడా పెళ్లి చేసుకోకుండా త‌మ‌ది చాలా చిన్న వ‌య‌స్సే అన్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇస్తూ ఉంటారు. సీనియ‌ర్ హీరోలు, ముస‌లి వాళ్లు సైతం 18 నుంచి 20 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న అమ్మాయిల ప‌క్క‌న రొమాన్స్ చేస్తూ ఉంటారు. ఇక హీరోయిన్లు కూడా ఇటీవ‌ల ట్రెండ్ మార్చేశారు. కెరీర్ బాగుంటే చాలు 40 ఏళ్ల‌కు ద‌గ్గ‌ర అవుతున్నా కూడా పెళ్లి చేసుకోవ‌డం లేదు. న‌య‌న‌తార‌, అనుష్క ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. వీరికి ఇప్ప‌ట‌కీ ఛాన్సులు వ‌స్తున్నాయి. అందుకే పెళ్లి అనే మాట‌కే వీరు దూరంగా ఉంటున్నారు. పెళ్లి చేసుకుంటే ఎక్క‌డ అవ‌కాశాలు త‌గ్గుతాయో అన్న‌దే వీరి భ‌యం.

ఇదిలా ఉంటే కొంద‌రు హీరోయిన్లు మాత్రం చిన్న వ‌య‌స్సులోనే పెళ్లి చేసేసుకున్నారు. చిన్న వ‌య‌స్సులో పెళ్లి చేసుకుని కూడా హీరోయిన్లుగా న‌టించి స‌క్సెస్ అయ్యారు. దివ్య‌భార‌తి అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. ఆమె తెలుగులో చేసిన సినిమాలు అన్ని బ్లాక్‌బ‌స్ట‌రే. రౌడీ అల్లుడు – అసెంబ్లీ రౌడీ – బొబ్బిలి రాజా ఇలా ప్ర‌తి సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. ఆమె కేవ‌లం 18 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే నిర్మాత సాజిద్ న‌డియ‌డ్ వాలాను పెళ్లాడింది.

ఇక సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి ఇప్పుడు బామ్మ‌, అమ్మ పాత్ర‌లు వేస్తున్నారు. ఆమెకు కేవ‌లం 17 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులోనే పెళ్లైపోయింది. ఆ త‌ర్వాత కూడా ఆమె హీరోయిన్‌గా చేశారు. ఇక మ‌రో దివంగ‌త సీనియ‌ర్ న‌టి జ‌యంతి సైతం కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండ‌గానే చిన్న వ‌య‌స్సులోనే పేకేటి శివ‌రాంను పెళ్లాడారు. అప్ప‌టికే ఆయ‌న‌కు పెళ్ల‌య్యింది. తెలుగు వారి మ‌దిలో హాసినిగా ఫిక్స్ అయిన జెనీలియా 21 ఏళ్ల‌కే అప్ప‌టి మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ త‌న‌యుడు రితీష్‌ను పెళ్లాడింది.

అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్‌గా సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన సారిక క‌మ‌ల్‌హాస‌న్‌ను 27 ఏళ్ల‌కే పెళ్లాడింది. ఇప్పుడు హీరోయిన్‌గా ఉన్న అదితి రావు హైద‌రీ 21 ఏళ్ల‌కే ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. త‌ర్వాత అత‌డి నుంచి విడిపోయింది. శాలిని త‌ల అజిత్‌ను ప్రేమించి 21 ఏళ్ల‌కే పెళ్లి చేసుకుంది.

ప్ర‌భాస్ ఫ‌స్ట్ సినిమా హీరోయిన్ శ్రీదేవి రాహుల్ అనే వ్య‌క్తిని 23 ఏళ్ల‌కే పెళ్లాడింది. ఇక బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ హీరోయిన్ రాధికా ఆఫ్టే కూడా ఓ వ్య‌క్తిని 23 ఏళ్ల‌కే పెళ్లి చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news