Moviesపవన్ కు ఊహించని షాక్..మండిపడుతున్న అభిమానులు..అసలు ఏం జరిగిందంటే..??

పవన్ కు ఊహించని షాక్..మండిపడుతున్న అభిమానులు..అసలు ఏం జరిగిందంటే..??

పవర్ స్టార్ పవన్, కండల వీరుడు రానా ప్రస్తుతం అయ్యప్పనుం అనే రీమేక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్, భీమ్లా నాయక్ అనే పవర్ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. మాస్ లో సాలిడ్ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే మాస్ లో ఈ చిత్రంకి భారీ హైప్ కూడా ఇప్పుడు నెలకొంది. ​

ఇప్పటికే విడుదలైన “భీమ్లా నాయక్” టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపింది. ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, హీరో ఎంట్రీ, యాక్షన్ ప్యాక్డ్ టీజర్ మెగాభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా “భీమ్లా నాయక్” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తోన్న ఈ మూవీ నుంచి టైటిల్ సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. “ఇరగదీసే ఇది ఫైరు సల్లగుండ, ఖాకీ డ్రెస్సు పక్కనెడితే ఈడే పెద్ద గూండా” వంటి పవర్​ఫుల్ లిరిక్స్​తో ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటోంది. “భీం భీం భీం భీం భీమ్లానాయక్… దంచి దడదడదడ లాడించే డ్యూటీ సేవక్…” అంటూ సాగుతున్న ఈ సాంగ్ అదిరిపోయిందంటున్నారు ఆయన అభిమానులు. ఇంత వరకు బాగానే ఉంది కానీ, ఇక్కడే పవన్ కు ఊహించని షాక్ తగ్గిలింది.


ఈ పాట లిరిక్స్ పై తెలంగాణ సీనియర్ ఈఫ్శ్ ఆఫీసర్ అభంతరం వ్యక్తం చేసారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్ ‘భీమ్లా నాయక్’ పాటలోని లిరిక్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణా కాప్స్ అంటే ఫ్రెండ్లీ పోలీసులు. మేము రక్షించే వాళ్ళమే కానీ ఎముకలు విరగొట్టే వాళ్ళం కాదు. పోలీసుల గురించి వివరించేందుకు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయి.. అంటూ డీసీపీ రమేష్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గామారింది. మ‌రి దీనిపై ర‌చ‌యిత‌, చిత్ర నిర్మాత నుండి ఏదైన స్పంద‌న వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ అభిమానులు మాత్రం ఆ పోలీస్ ఆఫిసర్ పై రీవర్స్ కౌంటర్ వేస్తున్నారు. పోలీసులు ప్రజలకు కాదు గవర్నమెంట్ కి ఫ్రెండ్లీ పోలీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news