Moviesఆ హాట్ బ్యూటీ పై పోలీస్ కేసు నమోదు..రీజన్ తెలిస్తే షాకే..?

ఆ హాట్ బ్యూటీ పై పోలీస్ కేసు నమోదు..రీజన్ తెలిస్తే షాకే..?

ఒక్క సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌లుగా మారిన వారు చాలా మందే ఉన్నారు. ముందుగా ఈ కోవలో మనకు ఠక్కున గుర్తుకొచ్చేది హీరోలు. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ కొట్టేశాడు హీరో విజయ్ దేవరకొండ. ఇక హీరోయిన్లు కూడా ఇదే కోవలో ఓవర్‌నైట్ స్టార్లుగా ఎదిగిన వారు ఉన్నారు. వారిలో RX100 సినిమాతో టాలీవుడ్ యువతకు పిచ్చెక్కించిన పాయల్ రాజ్‌పుత్ ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా ‘ఆర్ ఎక్ 100’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన పాయల్ రాజ్ పూత్ ఇప్పుడు తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. కేవలం తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కించడమే కాదు గాఢమైన ముద్దు సీన్లలో ఈ అమ్మడి నటన దర్శక, నిర్మాతలే షాక్ అయ్యారు. మొదటి సినిమాలోనే నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర పోషించడమే కాకుండా బోల్డ్ యాక్టింగ్ తో.. ఘాటు లిప్ లాకులతో చెలరేగిపోయింది. పాయల్ రాజ్ పూత్ హాట్ హాట్ గా ఫోటో షూట్స్ లో పాల్గొంటు మరింత ఆకర్షిస్తూ వస్తుంది. ఆ ఫోటోలను ఎడాపెడా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లో అప్లోడ్ చేస్తూ.. కుర్రాలకు నిద్రలేకుండా చేసుంది.

అయితే హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌ కు ఊహించని షాక్ తగ్గిలింది. ఆమె పై కేసు నమోదైంది. పాయల్ రాజ్‌పుత్‌ కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. గత నెల 11న పాయల్ రాజ్‌పుత్‌ పెద్దపల్లిలోని వెంకటేశ్వర షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అంత వరకు బాగానే ఉంది. కానీ, ఆ సమయంలో పాయల్‌ మాస్క్ పెట్టుకోలేదు. అంతేకాదు ఆ షాపు యాజమానులు కూడా పాయల్ ని ఫాలో అవుతూ మాస్కులు ధరించాలేదు కదా..కనీసం భౌతిక దూరం కూడా పాటించలేదు. దీంతో వీళ్ళూ కోవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ పెద్దపల్లికి చెందినా ఓ వ్యక్తొ కోర్టులో పిర్యాదు చేసారు. ఈ క్రమంలో .. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు శీ తెలిపారు. దీని పై నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. అమ్మడు మేకప్ మీద పెట్టిన శ్రద్ద మాస్క్ పై పెట్టుంటే బాగుండేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news