Gossipsతమన్నా షాకింగ్ డెసిషన్.. ఆ మెగా హీరో దిమ్మ తిరిగిపోయింది..?

తమన్నా షాకింగ్ డెసిషన్.. ఆ మెగా హీరో దిమ్మ తిరిగిపోయింది..?

టాలీవుడ్ లో హాట్ బ్యూటీ మిట్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. హ్యాపీడేస్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ్ లో నటిస్తుంది. రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్న ఈ టైంలో ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్స్ పని ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాంబినేషన్స్ రిపీట్ చూసేందుకు కూడా ఇష్టపడట్లేదు. సమంత ఎలాగు అక్కినేని కోడలుగా మారిన తర్వాత సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. ఇక వచ్చిన అవకాశాలతో కాజల్ ఈమధ్య మళ్లీ కెరియర్ స్పీడందుకోగా తమన్నా మాత్రం అరకొర అవకాశాలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. బాహుబలిలో నటించిన ఆమె ఇలా అవకాశాలు లేకుండా ఖాళీగా ఉండటం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు.

అందుకే వచ్చిన ఏ చిన్న అవకాశం వదలను అంటుంది తమన్నా.. అంతేకాదు తెలిసిన దర్శకులతో తనకు ఛాన్స్ ఉంటే ఇవ్వండి అంటూ అడుగుతుందట. సాధారణంగా స్టార్ హీరోయిన్స్ ఎవరు ఇలా అడిగినట్టు ఎప్పుడు చెప్పుకోలేదు. కాని అవకాశాల కోసం మొహమాటం లాంటివి పక్కన పెట్టేసిన తమన్నా సినిమా ఛాన్స్ ఇవ్వండి ఎలాంటి రోల్ అయినా పర్వాలేదు. అవసరమైతే గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచుతా అంటుందట. క్రేజ్ ఉన్న ఈ కొద్దినాళ్లలో ఎంతోకొంత మొత్తాన్ని సంపాదించాలని ప్లాన్ చేసింది అమ్మడు.

ఇక ఇప్పటికే ఎన్నో ఐటెం సాంగ్స్ చేసిన తమన్నా… తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గని’ మూవీ కోసం ఆమెను సంప్రదించగా ఓకే చెప్పిందని తెలుస్తోంది. ఐతే.. ఇందుకోసం ఆమె తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..? అక్షరాలా 75 లక్షలు. తమన్నా ఓ సినిమాకు కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాంటిది ఒక్క సాంగ్ కె ఏకం గా 75 లక్షలు డిమాండ్ చేయడం షాక్ కలిగించే విషయమే. దీంతో మెగా హీరో షాక్ అయ్యాడట. సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఈ పాటలో తమన్నా హాట్ ట్రీట్ పిచ్చిక్కించనుందని తెలుస్తోంది.

దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో ‘డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ లోను రాణిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ మిల్కీ బ్యూటీ హవా తెలియంది కాదు. సినిమాల కంటే ఎక్కువగా తన గ్లామర్ అందాలను సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ‘సీటీమార్‌’ సినిమాను పూర్తి చేసిన ఆమె.. ‘గుర్తుందా.. శీతాకాలం’, ‘మ్యాస్ట్రో’, ‘ఎఫ్‌ 3’ సినిమాల్లోను నటిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news