Moviesశృతి హాస‌న్ కి తన బాడీలో ఆ పార్ట్ అంటే చాలా...

శృతి హాస‌న్ కి తన బాడీలో ఆ పార్ట్ అంటే చాలా ఇష్టమట..పాప ఓపెన్ గా చెప్పేసిందిరోయ్..!!

శృతి హాస‌న్.. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచ్యం అక్కర్లేదు. విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ వారసురాలిగా సినీ ఇండ‌స్ట్రీలో​కి ఎంట్రీ ఇచ్చిన శృతి హాస‌న్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది. సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ స్టేటస్ సంపాదించుకోడానికి చాలా కష్టపడిన శృతి..న‌టిగా, సింగ‌ర్‌గా, మంచి డ్యాన్స‌ర్‌గా ఎదుగుతూ.. కెరీర్‌ పరంగా దూసుకెళ్తున్న సమయంలో తన వ్యక్తిగత కారణాల వల్ల కొన్నాళ్లు సినిమాల‌కు దూర‌మై.. మళ్లీ ఎంట్రీ ఇచ్చింది.

టాలీవుడ్ బ్యూటీ శృతిహాసన్.. ప్రస్తుతం రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో బాగా దూసుకుపోతుంది. తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న శృతిహాసన్ సింగర్ గా పలు సినిమాలలో కూడా పాడింది. స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా నిలిచింది. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషలలో కూడా నటించింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇక కొన్ని వ్యక్తిగత విషయాలలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇక ఈ అమ్మడు తన అభిమానులతో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చిట్‌ చాట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అభిమాని అడిగిన వింత ప్రశ్నకు షాకింగ్‌ సమాధానమిచ్చింది.
అభిమాని : మీ శరీరంలో మీకు ముక్కు అంటే చాలా ఇష్టం అనుకుంటా.. అది నిజమేనా
శృతి హాస‌న్: అవును నాకు ముక్కు అంటే ఇష్టమే.. దాని కోసమేగా చాలా డబ్బులు ఖర్చు పెట్టా.. ఏ మాత్రం తడుముకోకుండా బదులిచ్చింది. దెబ్బతో శృతి ఇచ్చిన రిప్లైకి షాక్‌లోకి వెళ్లాడు ఆ నెటిజన్‌. కాగా ప్రస్తుతం ఈ రిప్లై నెట్టింట హల్‌చల్‌ చేస్తూ వైరల్‌గా మారింది.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news