Gossipsఏవండోయ్ ఇది విన్నారా..అల్లు అర్జున్ పక్కన ఆ హాట్ బ్యూటీ.. ఇక...

ఏవండోయ్ ఇది విన్నారా..అల్లు అర్జున్ పక్కన ఆ హాట్ బ్యూటీ.. ఇక కెవ్వు కేకే..?

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా సంస్థలు కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. మలయాళీ వెర్సటైల్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ‘పుష్ప’ మూవీ గురించి వస్తున్న అప్‌డేట్స్ సినిమా పట్ల ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. అల్లు అర్జున్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు డైరెక్టర్ సుకుమార్.

ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ గురించి చాలా వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకోసం ఊర్వశీ రౌటెలాను, అనన్యపాండే అడిగినట్లు టాక్. బన్నీ, డీఎస్పీ, సుకుమార్ కాంబోలో వచ్చే ఐటెం సాంగ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో, మాస్ ఆడియెన్స్‌కి ఎంతటి కిక్ ఇస్తాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ‘ఆర్య’, ‘ఆర్య-2’ కి ఏమాత్రం తగ్గకుండా ఈ హ్యాట్రిక్ ఫిలింకి అదిరిపోయే ఐటెం నంబర్ కంపోజ్ చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. తాజా సమాచారం మేరకు స్పెషల్ సాంగ్‌లో బన్నీతో కలిసి స్టెప్పులెయ్యడానికి సన్నీ లియోన్‌ని అప్రోచ్ అయ్యారట నిర్మాతలు. అయితే ఈ సినిమాలోని ఓ ఐటెమ్ నంబర్‌లో ఆమె నటించడానికి 90 లక్షలు డిమాండ్ చేసిందని టాక్.

మంచు మనోజ్ ‘కరెంట్ తీగ’ లో కాసేపు మెరిసిన సన్నీ కొద్దికాలం తర్వాత ఐటెం సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. కాకపోతే రెమ్యునరేషన్ అక్షరాలా 90 లక్షలు అడిగిందట. అమ్మడికున్న డిమాండ్ అలాంటింది కాబట్టి అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారు మేకర్స్. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన బన్నీ మాస్ లుక్స్ ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో అది కూడా రెండు భాగాలుగా ‘పుష్ప’ సినిమాను రూపొందిస్తుండటం సినిమాపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news