Moviesఆ లెజండరీ నటుడి మనవరాలు హీరోయిన్‏గా గ్రాండ్ ఎంట్రీ..మూహుర్తం ఫిక్స్..?

ఆ లెజండరీ నటుడి మనవరాలు హీరోయిన్‏గా గ్రాండ్ ఎంట్రీ..మూహుర్తం ఫిక్స్..?

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసులు మాత్రమే దూసుకుపోతున్నారు. కేవలం కొద్ది మంది వారసురాళ్లు మాత్రమే సినీ రంగ ప్రవేశం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నవారున్నారు. అటు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు సెలబ్రెటీల కూతుర్లు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినవారు చాలా తక్కువ. అయితే ఈ మధ్య వారుసురాళ్లు సైతం సినీ రంగ ప్రవేశం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ లెజండరీ నటుడు డాక్టర్ రాజ్ కుమార్ మనవరాలు ధన్య రామ్ కుమార్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్.

లెజెండరీ నటుడు రాజ్ కుమార్ ఫ్యామిలీ కన్నడ పరిశ్రమని ఏల్తోన్న సంగతి తెలిసిందే. రాజ్ కుమార్ అనంతరం ఆయన కుమారులు వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు.

శివరాజ్ కుమార్.. పునీత్ రాజ్ కుమార్ అగ్ర హీరోలుగా రాణిస్తున్నారు. ఇందులో పవర్ స్టార్ గా పాపులరైన పునీత్ రాజ్ కుమార్ హవా అసాధారణం. ప్రస్తుతం అక్కడి పరిశ్రమలో పునీత్ రాజ్ కుమార్ భారీగా పారితోషికం తీసుకుంటోన్న బడా హీరో.

అయితే ఇంతటి స్టార్ ఫ్యామిలీ నుంచి మరొక నట వారసురాలు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. ఆమె ఎవరో కాదు పవర్ స్టార్ రాజ్ కుమార్ మనవరాలు ధన్య రామ్ కుమార్.

వారి తాత లాగే సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవాలని ,ఆమె కూడా తన సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతోంది. ఆమె కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె నటించిన సినిమా లాంచింగ్ కూడా కాబోతోందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news