Gossipsపవన్ పక్కన ఆ మెగా హీరోయిన్..థియేటర్స్ దద్దరిల్లే మాస్టర్ ప్లాన్..??

పవన్ పక్కన ఆ మెగా హీరోయిన్..థియేటర్స్ దద్దరిల్లే మాస్టర్ ప్లాన్..??

రకుల్ ప్రీత్ సింగ్.. పదేళ్ల కింద కన్నడ సినిమా గిల్లితో ఇండస్ట్రీకి వచ్చింది ఈ భామ. ఆ తర్వాత హిందీలో యారియాన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ వెంటనే సందీప్ కిషన్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో ఫస్ట్ హిట్ అందుకుంది. వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా అడుగుపెట్టి సక్సెస్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్‏గా కొనసాగింది. మొదటి సినిమానే ఎంతో విజయవంతం కావడంతో దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది రకుల్.

ఇదిలా ఉండగా తెలుగులో ఓ స్పెషల్ సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించగా అందుకు రకుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా..?? ఆయన మరెవరో కాదండి… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును.. పవన్ నెక్స్ట్ మూవీ లో రకుల్ బేబి ఓ స్పెషల్ సాంగ్ చేయబోతోందట. మంచి ఆఫర్ రావడంతో కాదనలేక.. ఓ వైపు హీరోయిన్ గా కొనసాగుతూనే మరోవైపు స్పెషల్ సాంగ్ కి సరే అన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

అయితే, రకుల్ ఇప్పటి వరకు ఎప్పుడు పవన్ సరసన నటించలేదు.. కానీ వీరిద్దరి జోడీ కడితే మాత్రం అదుర్స్ అంటున్నారు మెగా అభిమానులు. అయితే ఈ సినిమా ఏది అనేది ఇంకా పక్కగా తెలియనప్పటికి.. బండ్ల గణేష్ నిర్మిస్తున్న దేవర సినిమా కోసం అయి ఉంటుందని సినీ వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news