ఎన్టీఆర్‌తో వైజ‌యంతీ మూవీస్ సినిమా… ఆ డైరెక్ట‌ర్ ఫిక్స్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కు గ‌త నాలుగైదేళ్లుగా ప్లాప్ అన్న మాటే లేదు. టెంప‌ర్‌తో ప్రారంభ‌మైన ఎన్టీఆర్ విజ‌యాల ప‌రంప‌ర‌కు బ్రేక్ లేదు. టెంప‌ర్ – నాన్న‌కు ప్రేమ‌తో – జ‌న‌తా గ్యారేజ్ – జై ల‌వ‌కుశ – అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమాలు వ‌రుస‌గా ఐదు హిట్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో న‌టిస్తున్నాడు. క‌రోనా లేక‌పోయి ఉంటే ఈ పాటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వ‌డంతో పాటు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసి ఉండేది. ఈ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8న ఆర్ ఆర్ ఆర్‌ను రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. అంత‌కంటే ముందే గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లో కూడా రిలీజ్ డేట్ ఇచ్చినా క‌రోనా దెబ్బ‌తో సినిమాను వాయిదా వేశారు.

ఎప్పుడో 2018 సెప్టెంబ‌ర్‌లో మాత్ర‌మే చివ‌రి సారిగా ఎన్టీఆర్ సినిమా వ‌చ్చింది. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ ఎన్టీఆర్ ఫేస్ థియేట‌ర్ల‌లో చూడ‌లేదు. మ‌రో నాలుగు నెల‌లు అయితే ఎన్టీఆర్ సినిమా వ‌చ్చి ఏకంగా మూడేళ్లు అయిన‌ట్టు అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్ స్టార్ట్ అయ్యాక ఇంత గ్యాప్ ఎప్పుడూ రాలేదు. అయితే క‌రోనా గ్యాప్ నేప‌థ్యంలో ఎన్టీఆర్ వ‌రుస‌గా క‌థ‌లు వింటూ.. సినిమాలు ఓకే చేసుకుంటూ పోతున్నాడు. ఈ క్ర‌మంలోనే కొర‌టాల శివ సినిమా ఓకే అయ్యింది.

ఇప్పుడు కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ సినిమా కూడా చ‌ర్చ‌ల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ – అట్లీ కాంబోలో సినిమాపై కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వ‌నీద‌త్ కుమార్తెలు ఈ సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. కొర‌టాల త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌.. ఆ వెంట‌నే అట్లీ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. క‌రోనా హ‌డావిడి పోతే ఇక ఎన్టీఆర్ సినిమాలు వ‌రుస‌గా లైన్లోకి వ‌చ్చేస్తాయి.