సీనియ‌ర్ ఎన్టీఆర్ ఆ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డారా… అస‌లు నిజాలేంటి ?

సినిమా ఇండ‌స్ట్రీ అన్నాక ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా ఎవ‌రో ఒక‌రితో లింకులు పెట్టేస్తూ ఉంటారు. హీరోల‌కు, హీరోయిన్ల‌కు మీడియా వాళ్లు కూడా ఊహించుకుంటూ లింకులు పెడుతూ ఉంటారు. అందులో వాస్త‌వ‌, అవాస్త‌వాలు ఎలా ఉన్నా బ‌య‌ట మాత్రం వారిద్ద‌రి మ‌ధ్య ఏదేదో ఉందంటూ ఓ ప్ర‌చారం అయితే జ‌రుగుతూ ఉంటుంది. అయితే ఇలాంటి ఓ ప్ర‌చారం సీనియ‌ర్ ఎన్టీఆర్ గురించి అప్ప‌ట్లో జ‌రిగింది. ఎన్టీఆర్‌కు బ‌స‌వ తార‌కంతో పెళ్ల‌య్యి.. ఆయ‌న సినిమాల్లో స్టార్ హీరోగా ఉన్న‌ప్పుడు ఆయ‌న ఓ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డ్డార‌ని.. వారిద్ద‌రు ఒక‌రంటే ఒక‌రు ఇష్ట‌పడ్డార‌న్న వార్త‌లు గుస‌గుస‌లుగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు కృష్ణ‌కుమారి. ఎన్టీఆర్ ఇండ‌స్ట్రీకి ఎంతో మంది హీరోయిన్ల‌ను ప‌రిచయం చేశారు. ఈ లిస్టులోనే కృష్ణ కుమారి కూడా ఉన్నారు. ఎన్టీఆర్‌తో ఆమె సినిమాలు చేస్తోన్న క్ర‌మంలోనే వారిద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం పెరిగింద‌ని అంటారు. ఆ టైంలోనే ముందుగా కృష్ణ కుమారే ఎన్టీఆర్‌పై ఇష్టం పెంచుకున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఈ విష‌యం ఆ నోటా ఈ నోటా బ‌య‌ట‌కు రావ‌డంతో స‌హ‌జంగానే ఎన్టీఆర్ ఇలా చేస్తున్నారా ? అన్న చ‌ర్చ స్టార్ట్ అయ్యింది. త‌ర్వాత ఏం జ‌రిగిందో గాని.. ఎన్టీఆర్ సోద‌రుడు త్రివిక్ర‌మ్ రావు కృష్ణ‌కుమారిని బెదిరించ‌డంతో ఆ త‌ర్వాత ఆమె ఎన్టీఆర్‌కు దూర‌మైంద‌ని అంటారు. అప్ప‌ట్లో చెన్నైలో ఉండే ఆమె ఆ త‌ర్వాత బెంగ‌ళూరుకు మ‌కాం మార్చేసింద‌ని చెపుతూ ఉంటారు.