`ఆచార్య`లో రామ్ చరణ్ కు జోడీగా కొత్త భామ‌..!

మెగా స్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్ కార‌ణంగా ఆగిపోయింది.

 

 

మ‌ళ్లీ ఇటీవ‌లే కొర‌టాల ఆచార్య షూటింగ్‌ను రీ స్టార్ట్ చేశారు. ఇక ఈ చిత్రంలో చిరు స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే ఓ కీల‌క పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు జోడీ ఎవ‌ర‌నేది తేల‌లేదు. రకుల్, రష్మిక, కియారా ఇలా ప‌లు వినిపించినా.. ఎవ‌రూ ఫైన‌ల్ కాలేదు.

 

 

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. చరణ్ సరసన కొత్త భామను తీసుకోవాలి కొర‌టాల నిర్ణ‌యించార‌ట‌. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ హీరోయిన్‌కు పెద్ద‌గా స్క్రీన్ స్పేష్ ఉండ‌ద‌ని.. అందుకే కొత్త హీరోయిన్‌ను తీసుకోనున్నార‌ని తెలుస్తోంది. అంతేకాదు, వచ్చే వారం హీరోయిన్ ను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మ‌రి ఆచార్య‌లో చ‌ర‌ణ్‌కు జోడీ ఎవ‌రో తెలియాలంటే.. మ‌రికోన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.