ఖరీదైన ఇల్లు కొన్న సుకుమార్.. ఎన్ని కోట్లంటే..?

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లెక్క‌ల మాస్ట‌ర్ అయిన ఈయ‌న 2004లో అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన `ఆర్య‌` సినిమాతో ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మై.. మొద‌టి చిత్రంతోనే అద్భుత విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నారు. ఆ త‌ర్వాత జ‌గ‌డం, ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌కు అల‌రించాడు.

 

 

అయితే ఈ చిత్రాల్లో కొన్ని బాక్సాఫిస్ వ‌ద్ద బోల్తా ప‌డినా.. సుకుమార్ స్టయిల్ ఆఫ్ మేకింగ్ మాత్రం విమర్శకుల‌ను ఆక‌ట్టుకుంది. ఇక ప్ర‌స్తుతం సుక్కూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా `పుష్ప‌` సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇదిలా ఉంటే.. సుకుమార్ గురించి ఓ క్రేజీ వార్త వైర‌ల్ అవుతోంది.

 

 

ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. స‌క్కూ తాజాగా ఓ ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేశాడ‌ట‌. ఆ ఇంటి ఖ‌రీదు అక్ష‌రాలు రూ. 12 కోట్లు అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల స‌మాచారం. కొండాపూర్ ప్రాంతంలో అన్ని సౌక‌ర్యాల‌తోనూ ఎంతో అందంగా సుకుమార్ కొత్త ఇల్లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రో విష‌యం ఏంటంటే.. సుకుమార్‌ ఇప్ప‌టికే కొత్త ఇంటి గృహ‌ప్ర‌వేశం కార్య‌క్ర‌మం కూడా పూర్తి చేశాడ‌ని.. అయితే క‌రోనా కార‌ణంగా ఈ కార్య‌క్ర‌మానికి ఎవ‌రినీ ఆహ్వానించ‌లేద‌ని అంటున్నారు.